Ajit Pawar: ఉద్ధవ్ ఆ పని చేసుంటే ఇప్పటికీ ఆయనే సీఎంగా ఉండేవారు.. మాజీ డీప్యూటీ సీఎం అజిత్ పవార్
ఇప్పుడు శివసేనకు ఎదురైన అనుభవాలు గతంలో ఎన్సీపీ ఎదుర్కొంది. కొద్ది రోజుల క్రితం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సైతం ఆ సందర్భాల్ని గుర్తు చేసుకున్నారు. ఒకానొక సమయంలో ఇక పార్టీ పని అయిపోయిందన్న స్థాయి నుంచి మళ్లీ.. ప్రజల్లో తిరుగుతూ నాయకుల్ని తయారు చేస్తూ పార్టీని నిలబెట్టినట్లు పవార్ చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యేల్ని తమవైపుకు లాక్కొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత కూడా ఎన్సీపీకి ఉంది.

Uddhav should have sought help of Chhagan says Ajit Pawar
Ajit Pawar: శివసేన పార్టీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు గెట్టు దాటినప్పుడే ఎన్సీపీ సీనియర్ నేత ఛగన్ భుజ్పాల్ను ఉద్ధవ్ థాకరే సంప్రదించి ఉంటే ఇప్పటికీ ముఖ్యమంత్రిగా కొనసాగేవారని మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత విపక్ష నేత అజిత్ పవార్ అన్నారు. ఇలాంటి రాజకీయాల్లో భుజ్పాల్ బాగా ఆరితేరిన వారని, సమస్య వచ్చినప్పుడే సంప్రదించి ఉంటే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేది కాదని ఆయన కాస్త ఆలస్యంగా స్పందించారు.
గురువారం రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘‘శివసేనకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినప్పుడే ఛగన్ భుజ్పాల్ను ఉద్ధవ్ థాకరే సంప్రదించి ఉండాల్సింది. ఇలాంటి విషయాల్లో భుజ్పాల్ చాలా అనుభవం, చాకచక్యం ఉన్నవారు. ఇలాంటి అనేక సందర్భాల్ని ఆయన అత్యంత తెలివిగా చక్కదిద్దారు. అప్పుడే భుజ్పాల్ను ఉద్ధవ్ కలిసి ఉంటే ఇప్పటికీ ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగేవారు’’ అని అజిత్ పవార్ అన్నారు.
ఇప్పుడు శివసేనకు ఎదురైన అనుభవాలు గతంలో ఎన్సీపీ ఎదుర్కొంది. కొద్ది రోజుల క్రితం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సైతం ఆ సందర్భాల్ని గుర్తు చేసుకున్నారు. ఒకానొక సమయంలో ఇక పార్టీ పని అయిపోయిందన్న స్థాయి నుంచి మళ్లీ.. ప్రజల్లో తిరుగుతూ నాయకుల్ని తయారు చేస్తూ పార్టీని నిలబెట్టినట్లు పవార్ చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యేల్ని తమవైపుకు లాక్కొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత కూడా ఎన్సీపీకి ఉంది.
CM Jagan On Elections : ఇవాళ్టి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలి-వైసీపీ నేతలకు సీఎం జగన్ సూచన