బ్రిటన్ ప్రధాని భారత పర్యటన వాయిదా

బ్రిటన్ ప్రధాని భారత పర్యటన వాయిదా

UK-PM-Boris-Johnson

Updated On : January 5, 2021 / 6:04 PM IST

UK PM Boris Johnson postpones India visit due to coronavirus crisis బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన వాయిదాపడింది. ప్రస్తుతం బ్రిటన్ లో కొత్త రకం కరోనా బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో బోరిస్ జాన్సన్ తన భారత పర్యటనను వాయిదావేసుకున్నారు. ఇవాళ ఉదయం బోరిస్ జాన్సన్ భారత ప్రధాని నరేంద్రమోడీకి ఫోన్ చేసి..ప్లాన్ ప్రకారం తాను భారత పర్యటనకు రాలేకపోతున్నానని చెప్పినట్లు సమాచారం.

వాస్తవానికి జనవరి-26,2021న జరిగే గ‌ణ‌తంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల్లో పాల్గొనేందుకు బ్రిటన్ ప్ర‌ధాని ఢిల్లీ రావాల్సి ఉంది. ఇటీవలే భారత విదేశాంగశాఖ కూడా బోరిస్..ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరవుతారని ప్రకటన చేసింది. అయితే,సెప్టెంబ‌ర్‌లో కొత్త క‌రోనా స్ట్రెయిన్ విజృంభించడంతో.. ప్రస్తుతం బ్రిట‌న్‌లో ప‌రిస్థితులు సీరియ‌స్‌గా మారాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో బోరిస్ తన భారత పర్యటనను వాయిదా వేసుకున్నారు.

మరోవైపు, క‌రోనా న్యూ స్ట్రెయిన్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో బోరిస్ సర్కార్..బ్రిటన్ లో మ‌ళ్లీ క‌ఠిన‌రీతిలో పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధించింది. మున్ముందు కొన్ని వారాలు మరింత కఠినంగా ఉండనున్నాయి. మనం చివరి దశలో ఉన్నట్లు నమ్ముతున్నా అని తాజాగా బోరిస్ జాన్సన్ టెలివిజన్ ఇంటర్వ్యూలో చెప్పారు. యూనివర్సిటీలన్నీ తమ స్టూడెంట్లకు ఫిబ్రవరి వరకూ రావొద్దని సూచనలు ఇచ్చేశాయి. బ్రిటన్ లోని కొన్ని ప్రాంతాల్లో కొవిడ్ కేసులు విపరీతంగా పెరిగాయి.

బ్రిటన్ తాజా గైడ్‌లైన్స్ ప్రకారం.. అత్యవసరం లేని షాపులు, పర్సనల్ కేర్ సర్వీసులు మూసే ఉంచుతారు. రెస్టారెంట్లు కేవలం పార్శిల్ సర్వీసులకుమాత్రమే అనుమతిస్తున్నారు. ఫిజికల్ స్కూల్స్ కూడా క్లోజ్ అయ్యే ఉంటాయి. ఫిబ్రవరి నెల మధ్య వరకూ నేషన్‌వైడ్ లాక్‍‌డౌన్ అనేది కొనసాగుతుంది.