Flyover‌ : కుప్పకూలిన ఫ్లైఓవర్‌.. 9 మందికి గాయాలు

ముంబై నగరంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ కుప్ప కూలింది. ఈ ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ప్రాంతంలో ఫ్లైఓవర్‌ నిర్మిస్తున్నారు.

Flyover‌ : కుప్పకూలిన ఫ్లైఓవర్‌.. 9 మందికి గాయాలు

Flyover‌

Updated On : September 17, 2021 / 7:50 AM IST

Flyover‌ : ముంబై నగరంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ కుప్ప కూలింది. ఈ ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ప్రాంతంలో ఫ్లైఓవర్‌ నిర్మిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 4.40 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటన స్థలికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అనే అనుమానంతో సహాయక చర్యలు చేపట్టారు. కాగా గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Read More : Modi Birthday : మోదీ బహుమతులు, జ్ఞాపికలు ఆన్ లైన్‌లో వేలం