Budget 2025: బడ్జెట్ ఎఫెక్ట్.. మధ్యతరగతికి భారీగా పెరగనున్న జీతాలు..

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా మధ్య తరగతి వర్గాలు ఫుల్ ఖుషీ అవుతున్నాయి.

Budget 2025: బడ్జెట్ ఎఫెక్ట్.. మధ్యతరగతికి భారీగా పెరగనున్న జీతాలు..

Union Budget 2025

Updated On : February 2, 2025 / 1:31 PM IST

Budget 2025: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ లో మధ్య తరగతి ఆదాయ వర్గాలకు ఆమె తీపికబురు అందించారు. కొత్త పన్ను విధానంలో చెల్లించాల్సిన పన్ను తగ్గేలా శ్లాబులను సవరించారు. 2014 తరువాత చూస్తే ప్రస్తుతం ప్రకటించిన శ్లాబులే మధ్య తరగతికి పెద్ద ఉపశమనం. రూ. 12లక్షల వరకూ పన్ను మినహాయింపు ఇవ్వడంపై మిడిల్ క్లాస్ ప్రజలు హ్యాపీగా ఉన్నారు. అయితే, ఈ నిర్ణయం వల్ల కేంద్ర ఖజానాకు దాదాపు రూ. లక్ష కోట్ల వరకూ నష్టం వాటిల్లుతుంది. ప్రభుత్వానికి ఇంత నష్టం వాటిల్లుతున్నా కేంద్ర ప్రభుత్వం రూ.12లక్షల వరకూ పన్ను మినహాయింపు ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ నిర్ణయం వెనుక.. ఆయా వర్గాల ప్రజల్లో డబ్బు మిగిలేలా చేయడమేనని తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. తద్వారా ఇన్ డైరెక్ట్ పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.

Also Read: అట్లుంటది బడ్జెట్ అంటే.. జస్ట్ రూ.25 వేల జీతం ఎక్స్ ట్రా వచ్చినందుకు.. వీళ్లకి రూ.63 వేల ట్యాక్స్..

బడ్జెట్ లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను రాయితీ పరిమితిని రూ. 7లక్షల నుంచి రూ. 12లక్షలకు పెంచింది. శ్లాబులు కూడా మార్పులు చేశారు. నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో మధ్య తరగతి ప్రజలకు పన్ను మినహాయింపుతో ప్రభుత్వం ఏమి సాధించాలనుకుంటున్నదో వివరించారు. మధ్య తరగతి ప్రజలపై పన్నుల భారాన్ని గణనీయంగా తగ్గించడం ద్వారా వారి చేతుల్లో ఎక్కువ డబ్బును ఉంచడమేనని తెలిపారు. తద్వారా గృహ వినియోగం, తదితర వాటిపై వారి పెట్టుబడిని పెంచుతుందని ఆమె తెలిపారు. పన్ను మినహాయింపును రూ.7లక్షల నుంచి రూ.12లక్షలకు పెంచడం వల్ల కోటి మందికి ప్రయోజనం కలుగుతుందని రెవెన్యూ కార్యదర్శి తుహీర్ కాంత పాండే చెప్పారు. భారతదేశంలో 90శాతం పన్ను దాఖలు చేసేవారు సంవత్సరానికి రూ.12లక్షల కంటే తక్కువ సంపాదిస్తున్నారు. అయితే, ప్రస్తుతం పన్ను చెల్లింపు ద్వారా మిగిలిన సొమ్ము తిరిగి వారు ఇతర పెట్టే పెట్టుబడుల ద్వారా ఆర్థిక వ్యవస్థలోకి తిరిగి వస్తుందని మేము ఆశిస్తున్నామని పాండే చెప్పారు.

Also Read: Union Budget 2025: బడ్జెట్ మిస్సయ్యారా.. డోంట్ వర్రీ ఆల్ డిటెయిల్స్ మీకోసం..

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా పెట్టుబడిని పెంచుతుంది. కొత్త ఉద్యోగాలను సృష్టికి కారణమవుతుంది. వేతనాలు పెరుగుదలకు కూడా కారణమవుతుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. దేశ జీడీపీ దాదాపు 60శాతం మేర కొనుగోలు శక్తిపైనే ఆధారపడి ఉంటుంది. జీడీపీ బాగుండాలంటే ప్రజల్లో కొనుగోలు శక్తిని తప్పకుండా పెంచాలి. రూ. 12లక్షల వరకూ ఆదాయపు పన్ను నుంచి మినహాయింపునివ్వడం వల్ల ఈ మేరకు డబ్బు ఆదా అవుతుంది. తద్వారా ఆదా అయిన డబ్బును గూడ్స్ అండ్ సర్వీసెస్ పై ఎక్కువగా ఖర్చు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇది క్రమంగా కొనుగోలు శక్తిని పెంచుతుంది. తద్వారా ఇన్ డైరెక్ట్ పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అయితే, ఈ ప్రక్రియ జరగాలంటే వచ్చే మూడునాలుగేళ్లు పడుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Raed: Income Tax : అసలు ఇన్‌కం ట్యాక్స్ ఎందుకు? ఎత్తేస్తే మంచిది కదా అనుకునే వారు.. ఈ స్టోరీ తప్పకుండా చదవాల్సిందే..

మధ్యతరగతి ప్రజలకు మేలు జరిగేలా కేంద్ర బడ్జెట్ ఉందని హోమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. మధ్య తరగతి ప్రజలు ఎప్పుడూ ప్రధాని మోదీ హృదయాల్లో ఉంటారు. ప్రతిపాదిత పన్ను మినహాయింపు మధ్య తరగతి ప్రజల ఆర్థిక శ్రేయస్సును పెంపొందించడానికి చాలా దోహదపడుతుందని అమిత్ షా పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. కొత్త పన్నుల విధానం గృహ వినియోగంతో పాటు మధ్య తరగతి ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచుతుందని, పెట్టుబడులు పెరగడంతోపాటు ఉధ్యోగ వృద్ధిని పెంచుతుందని బీజేపీ తన అధికారిక ఖాతాలో ట్వీట్ చేసింది.