Minister Nirmala Sitharaman : పింఛను కోసం 70 ఏళ్ల వృద్ధురాలు కష్టం చూసి చలించిపోయిన మంత్రి సీతారామన్.. అధికారులకు ఆదేశాలు

ఫించన్ కోసం 70 ఏళ్ల సూర్యా హరిజాన్ పరిస్థితి తెలుసుకుని మంత్రి నిర్మలమ్మ చలించిపోయారు. బ్యాంకు అధికారుల వివరణ కోరారు. మానవతా కోణంలో స్పందించాలని ఆదేశించారు.

Minister Nirmala Sitharaman : పింఛను కోసం 70 ఏళ్ల వృద్ధురాలు కష్టం చూసి చలించిపోయిన మంత్రి సీతారామన్.. అధికారులకు ఆదేశాలు

Nirmala Sitharaman reacts 70 Year Old woman

Minister Nirmala Sitharaman : వృద్ధాప్య పింఛను కోసం ఒడిశాలో 70 ఏళ్ల వృద్ధురాలు ఎండలో కొన్ని కిలోమీటర్లు నడిచన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ దృష్టికి వెళ్లటంతో సదరు వృద్ధురాలు పడిన కష్టం చూసి నిర్మలమ్మ చలించిపోయారు. సూర్యా హరిజాన్ అనే 70 ఏళ్ల వృద్ధురాలు కుర్చీనే స్టిక్ గా చేసుకుని ఎర్రటి ఎండలో కాలికి చెప్పులు కూడా లేని దీనావస్థలో ఆమె పింఛను కోసం ఏప్రిల్ 17న (2023)ఆ వృద్ధురాలు అన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లినప్పటికీ ఆమెకు ఆ డబ్బు చేతికి రాలేదు. ఆమె వేలిముద్ర సరిపోల్చటంలేదనే కారణంతో బ్యాంకు సిబ్బంది చెప్పటంతో ఆమెకు ఫించను అందలేదు.

ఒడిశాలోని నబరంగ్ పూర్ జిల్లా ఝరిగావ్ బ్లాక్ లో సూర్యా హరిజాన్ పరిస్థితి తెలుసుకుని నిర్మలమ్మ చలించిపోయారు. దీనిపై ఆమె బ్యాంకు అధికారుల వివరణ కోరారు. మానవతా కోణంలో స్పందించాలని ఆదేశించారు. ఝరిగోన్ లోని ఎస్ బీఐ శాఖ నుంచి పింఛను తెచ్చుకునేందుకు ఆమె ఇంత కష్టం పడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఆమె నివసించే ప్రాంతంలో బ్యాంక్ మిత్ర లేరా? అని ప్రశ్నించారు. మంత్రి ఆదేశాలతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు ఆగమేఘాల మీద స్పందించారు.

మంత్రి యాక్షన్ కు బ్యాంకు అధికారులు వెంటనే రియాక్ట్ అయ్యారు. దీనిపై ఝరిగావ్ ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ వివరణ ఇస్తు..మేడమ్.. మేము కూడా ఈ వీడియోని చూసి అంతే బాధపడ్డాం. ఈ వీడియోలోని శ్రీమతి సూర్య హరిజన్ ప్రతి నెలా తన గ్రామంలోని సీఎస్ పీ పాయింట్ వద్ద వృద్ధాప్య ఫించను తీసుకునే వారు. వయసు పెద్దది కావడం..పైగా ఆమె చేతికి గాయలు అవ్వటంతో ఆమె వేలి ముద్రలు సీఎస్ పీ పాయింట్ డేటాతో సరిపోలడం లేదు. అయినా ఈ సమస్యను మేము పరిష్కరిస్తాం మేడమ్ అంటూ చెప్పుకొచ్చారు. అలా మంత్రిగా ఆదేశాలతో ఆమె తన బంధువును వెంట బెట్టుకుని జారిగోన్ లోని బ్రాంచ్ ను సంప్రదించటంతో బ్రాంచ్ మేనేజర్ వెంటనే ఆమె ఖాతా నుంచి డెబిట్ చేసి ఆమెకు చెల్లింపులు చేశారు. వచ్చే నెల నుంచి ఇంటి వద్దే పింఛను ఇస్తామని హామీ ఇచ్చారు.