Gulam Nabi Azad: గాంధీ కుటుంబంపై గులాం నబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు
జూనియర్ లీడర్లకు అటువంటి అవకాశం దొరకడం లేదని అన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలవడం గురించి ఇప్పుడు ఆలోచించడం కూడా అసాధ్యమేనని అన్నారు. పార్టీలో ప్రజాస్వామ్యం అనేది గత చరిత్ర అని చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత ఆ పార్టీ తనను ప్రమాదకారిగా భావిస్తోందన్నారు

Gulam Nabi Azad
Gulam Nabi Azad: కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టిన సీనియర్ రాజకీయ నాయకుడు, డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ చీఫ్ గులాం నబీ (Gulam Nabi Azad) ఆజాద్ ఉన్నట్టుండి గాంధీ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ (Indira Gandhi) పనితీరుకు, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) వ్యవహార శైలికి చాలా తేడా ఉందని విమర్శించారు. వాస్తవానికి తనకు కాంగ్రెస్ పార్టీతో దశాబ్దాల అనుబంధం ఉందని, ఆ పార్టీ పట్ల తనకు చెడు అభిప్రాయం లేదని ఆయన పేర్కొనడం గమనార్హం.
BJPLeaks : బండి సంజయ్ అరెస్ట్.. ట్రెండింగ్‌లో #BJPLeaks
ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆజాద్ మాట్లాడుతూ, కాంగ్రెస్‌కు నాయకత్వం వహించిన ఇందిరా గాంధీ, సోనియా గాంధీ పనితీరులో తేడాల గురించి వివరించారు. పార్టీ వ్యవహార శైలిలో తీవ్రమైన మార్పులు వచ్చాయని అన్నారు. ‘‘నియామకాల సంస్కృతి’’ పెరిగిపోయిందన్నారు. ఇందిరా గాంధీ వ్యవహార శైలి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేదన్నారు. ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా తాను పని చేసిన కాలంలో ఆమెతో చాలా సన్నిహితంగా వ్యవహరించినట్లు తెలిపారు. ఆ రోజుల్లో తాను ఆమెను ఎప్పుడు కావాలంటే అప్పుడు కలవగలిగేవాడినని చెప్పారు.
అయితే నేటి పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని ఆయన అన్నారు. జూనియర్ లీడర్లకు అటువంటి అవకాశం దొరకడం లేదని అన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలవడం గురించి ఇప్పుడు ఆలోచించడం కూడా అసాధ్యమేనని అన్నారు. పార్టీలో ప్రజాస్వామ్యం అనేది గత చరిత్ర అని చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత ఆ పార్టీ తనను ప్రమాదకారిగా భావిస్తోందన్నారు. తనను కాంగ్రెస్ వ్యతిరేకించినంతగా మరే ఇతర పార్టీ వ్యతిరేకించలేదన్నారు. ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటులో తనను ప్రశంసించారని, అప్పుడు కాంగ్రెస్ సంతోషించడానికి బదులు తీవ్రంగా బాధపడిందని గుర్తు చేశారు. ఇక తనకు భారత ప్రభుత్వం ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని ఇచ్చినపుడు కూడా కాంగ్రెస్ వ్యతిరేకించిందని ఆజాద్ అన్నారు.