Uttar pradesh : రూ.200ల కోట్లు ఎకౌంట్లో పడ్డాయని లబోదిబోమన్న కూలి .. పోలీసులకు ఫిర్యాదు

తన బ్యాంక్ ఎకౌంట్లో కోట్ల రూపాయలు జమ అయ్యేసరికి ఓ పేదవాడు కంగారుపడిపోయాడు. తన జీవితంలో ఏం జరుగుతోందో తనకు అర్థం కావటంలేదంటూ లబోదిబోమంటు స్థానిక పోలిస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.

Uttar pradesh : రూ.200ల కోట్లు ఎకౌంట్లో పడ్డాయని లబోదిబోమన్న కూలి .. పోలీసులకు ఫిర్యాదు

UP daily laborer

UP laborer bank account Rs. 200 crores  : అతనో రోజువారీ కూలి. కూలికి వెళితేనే గానీ కుటుంబం గడవని పేదవాడు. ఆ కూలి డబ్బులతోనే కుటుంబం అంతా గడవాలి. అటువంటిది అతని బ్యాంక్ ఎకౌంట్ లో కనీసం రూ.10వేలు ఉంటే గొప్పే. కానీ ఓరోజు అతను షాక్ అయ్యేలా ఓ అద్భుతం జరిగింది. తన బ్యాంక్ ఎకౌంట్లో ఏకంగా రూ.200ల కోట్లు పడ్డాయి. దీంతో అతను షాక్ అయ్యాడు.కంగారుపడిపోయాడు. తన జీవితంలో అంత డబ్బుని ఎప్పుడు కళ్లతో చూసిందేలేదు. అటువంటిది తన బ్యాంక్ ఎకౌంట్ లో ఏకంగా రూ.200ల కోట్ల పడేసరికి హడలిపోయాడు. లబోదిబోమన్నాడు.

బ్యాంక్ లో అంత డబ్బు పడితే సంతోషించాలి గానీ కంగారుపడటం ఎందుకంటారా…? దానికి ఓ కారణం ఉంది. ఎప్పుడు రూ.10వేలు కూడా లేని అతని ఎకౌంట్ లో సడెన్ గా రూ.200లకోట్లు పడేసరికి ఇన్ కమ్ ట్యాక్ వారు కన్ను పడింది. అంతే నోటీసులు ఇచ్చారు. అంతేకాదు గతంలో అతని పాన్ కార్డు కూడా కనిపించకుండా పోయిందట. దీంతో పాపం సరదరు కూలి హడలిపోయాడు. తన జీవితంలో ఏం జరుగుతోందో తనకు అర్థం కావటంలేదంటూ లబోదిబోమంటు స్థానిక పోలిస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. విషయం చెప్పాడు.

Bonus : ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు

ఉత్తర్‌ప్రదేశ్‌ బస్తీ జిల్లా బతానియా గ్రామానికి చెందిన కూలీ శివప్రసాద్‌ ఢిల్లీలో రోజువారీ కూలిపనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈక్రమంలో అతని బ్యాంకు ఎకౌంట్లో రూ.200 కోట్లు జమ అయ్యాయి. దీంతో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు శివప్రసాద్‌ కు నోటీసులు ఇచ్చారు. అంతేకాదు ఇన్ కమ్ ట్యాక్ కింద అతని ఎకౌంట్లో పడిన రూ.200కోట్ల నుంచి రూ.4.58 లక్షలు ట్యాక్స్ కింద డెబిట్‌ చేసుకున్నారు.

2019లో తన పాన్‌కార్డు పోయిందని ..ఇప్పుడు తన ఎకౌంట్లో రూ.200 కోట్లు జమ కావటం..ఇన్ కమ్ ట్యాక్ కింద కొంత మొత్తం కట్ కావటం వంటి ఘనటనతో తనకు పిచ్చెక్కుతోందని వాపోయాడు. తాను పోగొట్టుకున్న పాన్ కార్డు ఆధారంగా తన పేరుతో ఎవరో ఏదో చేస్తున్నారని ఈ సమస్యల్లోంచి ఎలా బయటపడాలో అర్థం కావటంలేదంటూ స్థానిక లాల్‌గంజ్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా గతంలో తమిళనాడులోని చెన్నైకు చెందిన ఓ క్యాబ్ డ్రైవర్ బ్యాంక్ ఎకౌంట్లో ఏకంగా రూ.9,000 కోట్లు జమ అయిన విషయం తెలిసిందే.