UP Election 2022: మేం అధికారంలోకి వస్తే.. యూపీకి ఇద్దరు సీఎంలు, ముగ్గురు డిప్యూటీలు

ఏఐఎమ్ఐఎమ్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ యూపీ ఎన్నికలకు భారీ కసరత్తులు ప్రారంభించారు. ఇందుకుగానూ తాము పొత్త పెట్టుకోవడానికి సిద్ధమేనని అన్నారు.

UP Election 2022: మేం అధికారంలోకి వస్తే.. యూపీకి ఇద్దరు సీఎంలు, ముగ్గురు డిప్యూటీలు

Owaisi

Updated On : January 23, 2022 / 9:08 AM IST

UP Election 2022: ఏఐఎమ్ఐఎమ్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ యూపీ ఎన్నికలకు భారీ కసరత్తులు ప్రారంభించారు. ఇందుకుగానూ తాము పొత్త పెట్టుకోవడానికి సిద్ధమేనని అన్నారు. బాబు సింగ్ కుష్వాహ పార్టీతో పొత్తు పెట్టుకోనున్నట్లు ప్రకటించారు. దాంతో పాటు తాము అధికారంలోకి వస్తే ఇద్దరు సీఎంలు, ముగ్గురు డిప్యూటీ సీఎంలతో పరిపాలిస్తామని దాని గురించి వివరించారు.

శనివారం ఈ పొత్తు గురించి ప్రకటించి భారత్ ముక్తి మోర్చా, బాబు సింగ్ కుష్వాహ పార్టీలతో కలిసి పనిచేస్తామని చెప్పారు. ‘మేం అధికారంలోకి వస్తే ఇద్దరు సీఎంలు, ఒకరు ఓబీసీ కమ్యూనిటీ నుంచి, మరొకరు దళిత్ కమ్యూనిటీ నుంచి ఉంటారని, దాంతో ముగ్గురు డిప్యూటీ సీఎంలను ముస్లిం కమ్యూనిటీ నుంచి తీసుకుంటామని’ హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: వీళ్లిద్దరి వల్లే బతికున్నా

గతంలో తాము ఓపీ రాజ్భర్స్ పార్టీ సుబ్ ఎస్పీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ఒవైసీ చెప్పారు. కానీ, ఆ పార్టీ అఖిలేశ్ యాదవ్ పార్టీతో కలిసి ఒవైసీని ఒంటరిగా వదిలేసింది. ఈ క్రమంలో శనివారం మరో పార్టనర్ తో కలిసి పొత్తును ప్రకటించారు.

ఇదిలా ఉంటే చాలా ప్రతిపక్ష పార్టీలు, సమాజ్ వాద్ పార్టీతో కలిసి ఒవైసీ పార్టీని బీజేపీ బీ టీం అంటూ విమర్శిస్తున్నారు.