UP CM: మేం రోజూ ఆరు లక్షల మందికి వ్యాక్సిన్ వేస్తున్నాం – సీఎం

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రోజూ ఆరు లక్షల మందికి వ్యాక్సినేషన్ చేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రశంసిస్తూ..

UP CM: మేం రోజూ ఆరు లక్షల మందికి వ్యాక్సిన్ వేస్తున్నాం – సీఎం

Up To Vaccinate 6 Lakh People Daily Against Covid Says Cm Adityanath

Updated On : June 21, 2021 / 5:03 PM IST

UP CM: రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రోజూ ఆరు లక్షల మందికి వ్యాక్సినేషన్ చేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రశంసిస్తూ.. ప్రస్తుత వ్యాక్సినేషన్ ఫేజ్ లో భాగంగా.. ఇళ్ల నుంచి వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి థ్యాంక్స్ తెలుపుతున్నాను. 18ఏళ్ల పై బడ్డ ప్రతి ఒక్కరికీ ఫ్రీ వ్యాక్సినేషన్ ఇస్తుంది ప్రభుత్వం. ఈ రోజు సోమవారం 7వేల 600 వ్యాక్సిన్ బూత్ లు రెడీ అయ్యాయి. ప్రతి రోజూ ఆరు లక్షల మందికి తగ్గకుండా వ్యాక్సిన్ వేస్తున్నాం’ అని ఆదిత్యనాథ్ తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత వ్యాక్సినేషన్ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వాలు సద్వినియోగపరుచుకోవాలని చెప్పిన రెండో రోజే యోగి ఇలా మాట్లాడారు. గవర్నమెంట్ డేటా ప్రకారం.. గడిచిన 24గంటల్లో 4.5లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. మొత్తం 2కోట్ల 12లక్షల మంది తొలి డోస్ వేసుకోగా 40.3లక్షల మంది రెండు డోసులు పూర్తి చేయించుకున్నారు.