US restaurant launches Modi ji thali: ప్రధాని మోదీ అమెరికా పర్యటన..యూఎస్ రెస్టారెంట్‌లో మోదీజీ పేరిట థాలీ ప్రారంభం

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో యూఎస్ దేశ న్యూజెర్సీ నగరంలోని ఓ రెస్టారెంట్ మోదీజీ పేరిట ప్రత్యేక థాలీని ప్రారంభించింది. భారతీయ సంతతికి చెందిన చెఫ్ శ్రీపాద్ కులకర్ణి మాట్లాడుతూ, అమెరికా దేశంలో ఉంటున్న భారతీయుల డిమాండ్‌ మేర మోదీజీ పేరిట ప్రత్యేక థాలీని తయారు చేసినట్లు చెప్పారు....

US restaurant launches Modi ji thali: ప్రధాని మోదీ అమెరికా పర్యటన..యూఎస్ రెస్టారెంట్‌లో మోదీజీ పేరిట థాలీ ప్రారంభం

Modi ji thali

Updated On : June 19, 2023 / 3:58 PM IST

US restaurant launches Modi ji thali: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో యూఎస్ దేశ న్యూజెర్సీ నగరంలోని ఓ రెస్టారెంట్ మోదీజీ పేరిట ప్రత్యేక థాలీని ప్రారంభించింది. భారతీయ సంతతికి చెందిన చెఫ్ శ్రీపాద్ కులకర్ణి మాట్లాడుతూ, అమెరికా దేశంలో ఉంటున్న భారతీయుల డిమాండ్‌ మేర మోదీజీ పేరిట ప్రత్యేక థాలీని తయారు చేసినట్లు చెప్పారు.చెఫ్ శ్రీపాద్ కులకర్ణి తయారుచేసిన మోదీ జీ థాలీలో ఖిచ్డీ, రసగుల్లా, సర్సన్ కా సాగ్, కాశ్మీరీ దమ్ ఆలూ, ఇడ్లీ, ధోక్లా, చాచ్, పాపడ్ వంటి ఇతర వంటకాలు ఉన్నాయి.రంగురంగుల థాలీని ప్రదర్శించారు.

Telangana governor Tamilisai: గర్భిణులు సుందరకాండ, పురాణాలు పఠించాలి…తెలంగాణ గవర్నర్ తమిళసై సలహా

భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్‌కు అంకితం చేసిన రెండవ థాలీని త్వరలో ప్రారంభించాలని రెస్టారెంట్ యజమాని యోచిస్తున్నట్లు సమాచారం.అమెరికా దేశ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీకి అమెరికాకు చెందిన కమలా హారిస్ లంచ్ ఇవ్వనున్నారు.మోదీజీ థాలీ జనాదరణ పొందుతుందని చెఫ్ భావిస్తున్నారు. భారత ప్రభుత్వం 2023వ సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరంగా ప్రకటించాలని చేసిన సిఫార్సును ఐక్యరాజ్యసమితి అమలు చేస్తోంది.

Australia bus crashes: ఆస్ట్రేలియాలో పెళ్లి బస్సు బోల్తా..10 మంది మృతి, మరో 11మందికి తీవ్ర గాయాలు

భారత ప్రధాని మోదీ అమెరికాలో తన పర్యటనలో జూన్ 22వతేదీన జరగనున్న విందులో అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నారు.యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించే భారతీయ ప్రధానిగా మోదీ నిలవనున్నారు.

Pakistan Drones seized: సరిహద్దు జిల్లాలో బీఎస్ఎఫ్ కాల్పులు…రెండు పాక్ డ్రోన్ల స్వాధీనం

ప్రధాని మోదీ పేరిట థాలీస్ రావడం కొత్తేమీ కాదు. గతేడాది సెప్టెంబర్ 17వతేదీన ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీకి చెందిన ఓ రెస్టారెంట్ 56 అంగుళాల నరేంద్ర మోదీ పేరుతో థాలీని విడుదల చేసింది. జూన్ 18వతేదీన అమెరికాలోని 20 ప్రధాన నగరాల్లో ఇండియా యూనిటీ డే మార్చ్‌తో భారతీయ అమెరికన్లు మోదీకి స్వాగతం పలికేందుకు ప్లాన్ చేస్తున్నారని నిర్వాహకులు ప్రకటించారు.