ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో ఇండియా మ్యాప్

గూగుల్ మ్యాప్స్‌లో దొరకని కచ్చితత్వాన్ని స్వదేశీ మ్యాప్‌లో దొరుకుతుంది. శాటిలైట్ ద్వారా తీసే ఫొటోల్లా కాకుండా నిర్దిష్టమైన కొలతలు, ఒంపులు అన్నీ ఈ యాప్‌లో వివరంగా ఉంటాయి. దీనిని భారత్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలోని సర్వే ఆఫ్ ఇండియా తయారు చేస్తుంది. కేవలం లక్ష్యాన్ని 10 సెంటీమీటర్ల దూరంలో గుర్తించేలా డిజిటల్ మ్యాప్‌ను రూపొందించారు. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్)కు మించిన కచ్చితత్వంతో దీనిని తయారుచేస్తున్నట్లు వెల్లడించారు.
డ్రోన్లను, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బిగ్‌డేటాను ఉపయోగించి రూపొందిస్తున్నట్లు ప్రభుత్వ సీనియర్ అధికారి వెల్లడించారు. ప్రాజెక్టును పరిపాలనా పరమైన ప్రయోజనాలు ముఖ్య ఉద్దేశ్యంతో తయారుచేస్తున్నారు. ఈ క్రమంలో ప్రాజెక్టు పూర్తయ్యాక ప్రజలకు, గ్రామ పంచాయతీలకు, ప్రభుత్వ అధికారులకు దీనిని అందజేయనున్నారు. ఇప్పటికే కర్ణాటక, హరియాణా, మహారాష్ట్ర, గంగా బేసిన్‌లో మ్యాప్ కోసం సర్వే నిర్వహిస్తున్నారు. గంగా బేసిన్‌కు ఇరువైపులా 25 కిలోమీటర్ల దూరంపాటు 10 సెంటీమీటర్ల కచ్చితత్వంతో మ్యాపింగ్ చేస్తున్నట్లు సర్వే అధికారి ప్రొఫెసర్ శర్మ వెల్లడించారు.
ఈ ప్రాజెక్టులో భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు ఏ సంబంధం లేదని ప్రొఫెసర్ శర్మ తెలిపారు. డ్రోన్లను ఉపయోగించి, మలుపులను పరిగణలోకి తీసుకొంటున్న హై రిజల్యూషన్ మ్యాప్ అని తెలిపారు. రిఫరెన్స్ పాయింట్లను 20 కిలోమీటర్లకు ఒక్కటిగా కేటాయించి.. అక్షాంశాలు, రేఖాంశాలను కచ్చితత్వంతో విభజించగలుగుతామన్నారు. దీని సహాయంతో 10 సెంటీమీటర్ల కచ్చితత్వంతోనే మ్యాప్ రూపొందించగలమన్నారు.