Uttar Pradesh: 13మంది మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
ఉత్తరప్రదేశ్ లోని ఓ పెళ్లి ఇంట్లో జరిగిన ఘటనలో 13మంది మహిళలు మృతిచెందారు. సెలబ్రేషన్స్ లో భాగంగా వారంతా నెబువా నౌరంగియా ప్రాంతంలో ఉన్నారు. వారున్న చోటుకు పక్కనే ఉన్న బావిలో పడి....

Uttar Praesds
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లోని ఓ పెళ్లి ఇంట్లో జరిగిన ఘటనలో 13మంది మహిళలు మృతిచెందారు. సెలబ్రేషన్స్ లో భాగంగా వారంతా నెబువా నౌరంగియా ప్రాంతంలో ఉన్నారు. వారున్న చోటుకు పక్కనే ఉన్న బావిలో పడిన ఇద్దరికి గాయాలైనట్లుగా పేర్కొన్నారు.
ఖుషీ నగర్ కు చెందిన జిల్లా మెజిస్ట్రేట్ ఎస్ రాజాలింగం.. కొందరు బావి స్లాబ్ మీద కూర్చొని ఉండగా బరువు ఎక్కువై ఒక్కసారిగా కుప్పకూలిందని వివరించారు.
‘ఈ ఘటనలో 13మంది చనిపోయినట్లు తెలిసింది. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. పెళ్లి వేడుకలో ఉన్న వారంతా బావి స్లాబ్ మీద కూర్చొండగా ఇలా జరిగింది. బాధిత కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున నష్టపరిహారం ఇస్తామని’ అని ఎస్ రాజాలింగ్ అన్నారు.
ఘటన గురించి తెలుసుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్టు చేశారు.
ఈ ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడ్డ వారు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.