Girl body : సగం కాలిన బాలిక శవాన్ని బయటకు తీసి పూజలు..ఎందుకంటే

చితిలో కాలుతున్న బాలిక శవాన్ని బయటకు తీసి 24 గంటలపాటు క్షుద్రపూజలు చేశారు. ఎందుకు అంటే తిరిగి బ్రతికించటానికట.మరి ఆ బాలిక బ్రతికిందా?

Girl body : సగం కాలిన బాలిక శవాన్ని బయటకు తీసి పూజలు..ఎందుకంటే

Girl Snake Bite (1)

Updated On : September 11, 2021 / 1:18 PM IST

Witchcraft to the girl body : చితిలో కాలుతున్న బాలిక శవాన్ని బయటకు తీసి క్షుద్రపూజలు చేసిన ఘటన.. ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌లో చోటుచేసుకుంది. ఇలా ఎందుకు చేశారనే ప్రశ్నకు స్థానికులు చెప్పిన సమాధానం ఈ కంప్యూటర్ యుగంలో కూడా వీడని మూఢనమ్మకాలకు ప్రతీకగా నిలిచింది. పాముకాటుకు గురైన బాలినకు బయటకు తీసి 24 గంటలపాటు క్షుద్రపూజలు చేశారు. ఎందుకంటే ఆ బాలిక తిరిగి బ్రతుకుతుందని అలా చేశామని చెబుతున్నారు.

Read more : Tamil Nadu : మధురైలో నిఫా ప్రత్యేక వార్డు ఏర్పాటు

ఈ జుగుస్సాకర ఘటన మహారాజ్ గంజ్ లోని కోఠీభార్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని సబ్యాలో జరిగింది. పబ్యాకు చెందిన ఛోట్‌కన్ అనే వ్యక్తి 15 కూతురు పాము కరిచి చనిపోయింది. అది తెలిసిన కుటుంబ సభ్యులు వెంటనే బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆబాలికను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని నిర్ధారించారు. దీంతో చేసేదేమీ లేక బాలిక మృతదేహాన్ని స్మశానవాటికకు తీసుకువెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు.

Read more :Child Murder : సింగరేణి కాలనీ చిన్నారి మర్డర్ కేసు నిందితుడు అరెస్ట్

చితిలో బాలిక మృతదేహం కాలిపోతుండగా చోట్ కన్ బంధువులు ‘బిషర్ అనే ఓ భూత వైద్యుడు మీ బిడ్డను బతికిస్తాడని చెప్పారు. దీంతో వెంటనే మండుతున్న చితిలోంచి బాలిక శవాన్ని బయటకు తీసి సదరు భూత వైద్యుడు ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ భూత వైద్యుడు కూడా వారిని మీ కూతుర్ని బతికిస్తానని నమ్మించాడు. కొన్ని రకాల పూజలు చేస్తే తిరిగి బ్రతుకుతుంది అని..ఆ పూజల ప్రభావంతో పామువిషయం అంతా హరించుకుపోతుంది అని చెప్పాడు. దీంతో కూతురు బతుకుతుందనే ఆశతో..24 గంటల పాటు ఆ బాలిక తిరిగి బతుకుతుందనే ఆశతో (మూఢనమ్మకంతో) పూజలు చేశారు. కానీ ఎంతకూ మృతదేహంలో చలనం రాలేదు. దీంతో తిరిగి అంత్యక్రియలు పూర్తి చేశారు.

Read more : Child Murder : సింగరేణి కాలనీ చిన్నారి మర్డర్ కేసు నిందితుడు అరెస్ట్