భారత్ లో బురఖా నిషేధించాలి అదొక ‘దుష్ట ఆచారం’ : బీజేపీ మంత్రి వ్యాఖ్యలు

భారత్ లో బురఖా నిషేధించాలి అదొక ‘దుష్ట ఆచారం’ : బీజేపీ మంత్రి వ్యాఖ్యలు

Bjp Minister Wants Ban On Burkhas (2)

Updated On : March 26, 2021 / 11:55 AM IST

BJP minister wants ban on Burkhas : ఉత్తరప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా బురఖాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళలు బురఖాలు ధరించడం అనేది దుష్ట ఆచారమని..అమానవీయ పద్ధతి అని వ్యాఖ్యానించారు. భారతదేశంలో మహిళలు బురఖాలు ధరించకుండా నిషేధం విధించాలని వింత వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికే పలు ముస్లిం దేశాలు బురఖాలను నిషేధించాయని వెల్లడించారు. ట్రిపుల్ తలాఖ్ ను ఎలా రూపుమాపామో, ఈ దురాచారంపైనా దేశంలో నిషేధాజ్ఞలు విధించాలని తెలిపారు. భారత్ లోని ముస్లిం మహిళలకు బీజేపీ ప్రభుత్వం ట్రిపుల్ తలాఖ్ పై భరోసా ఇచ్చామని.. బురఖాలను భారత్ లో నిషేధించాలని అన్నారు.

మంత్రి శుక్లా ఇటీవలే మసీదుల్లో మైకులు, లౌడ్ స్పీకర్లపై ఆంక్షలు విధించాలని బల్లియా జిల్లా మేజిస్ట్రేట్ కు లేఖ రాసి వార్తల్లోకెక్కారు. రోజుకు ఐదు సార్లు నమాజ్ ను మైకులో వినిపిస్తుంటారని, ఇక ఇతర సందేశాలు, విరాళాలకు సంబంధించిన విజ్ఞప్తులు రోజంతా వినిపిస్తూనే ఉంటారని ఆరోపించారు. యోగా, ధ్యానం, ప్రార్థనలు, ఇంకేవైనా అధికారిక కార్యక్రమాలు చేసేవారికి ఇవి ఆటంకం కలిగిస్తుంటాయని ఆయన ఆరోపించారు.