Uttarakhand Char Dham Yatra : చార్ధామ్ యాత్రలో విషాదం.. 12 రోజుల్లో 31 మంది మృతి
చార్ ధామ్ యాత్రలో విషాదం నెలకొంది. 12 రోజుల్లోనే 31 మంది యాత్రికులు చనిపోయారు. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.(Uttarakhand Char Dham Yatra)

Uttarakhand Char Dham Yatra
Uttarakhand Char Dham Yatra : 12 రోజుల్లోనే 31 మంది యాత్రికులు మరణించారు. మే నెలలో ప్రారంభమైన ఉత్తరాఖండ్ లోని చార్ ధామ్ యాత్రలో ఈ విషాదం నెలకొంది. బీపీ, గుండెనొప్పి, మౌంటెన్ సిక్ నెస్ వంటి వాటితో 12 రోజుల్లోనే 31 మంది యాత్రికులు చనిపోయారు. యాత్రికుల మృతి నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఆరోగ్యంగా ఉన్నవారినే తీర్థయాత్రలకు అనుమతించే విధంగా వైద్య పరీక్షలను ప్రారంభించింది. అటు, అనారోగ్యంతో ఉన్న వారు, కోలుకున్న తర్వాతే యాత్రకు వెళ్లాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

Uttarakhand Char Dham Yatra 31 pilgrims die due to high BP, heart attack in 12 days
Char Dham Yatra: చార్ ధామ్ యాత్ర వెళ్లేవారికి ఐఆర్సీటీసీ డిస్కౌంట్ ఆఫర్
‘మే 3 నుంచి చార్ ధామ్ యాత్ర ప్రారంభమైంది. హై బీపీ, కార్డియాక్ అరెస్ట్, మౌంటెన్ సిక్ నెస్ తో యాత్రికులు మరణించారు. ఇప్పటివరకు 31 మంది యాత్రికులు చనిపోయారు’ అని ఉత్తరాఖండ్ డైరెక్టర్ జనరల్ హెల్త్ డాక్టర్ శైలజ భట్ తెలిపారు. ఈ పరిస్థితుల్లో హెల్త్ స్క్రీనింగ్ చేపట్టింది ప్రభుత్వం. ఆరోగ్యంగా, ఫిట్ గా ఉన్నవారినే యాత్రకు అనుమతిస్తున్నారు.

Uttarakhand Char Dham Yatra 31 pilgrims die due to high BP, heart attack in 12 days
యాత్రలోని పలు ప్రాంతాల్లో హెల్త్ స్క్రీనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఆరోగ్యంగా ఉన్నవారినే యాత్రను కొనసాగించేందుకు అనుమతిస్తున్నామని డాక్టర్ భట్ వెల్లడించారు. రిషికేశ్ ఐఎస్బీటీ రిజిస్ట్రేషన్ సైట్ లో యాత్రికులకు హెల్త్ స్క్రీనింగ్ ప్రారంభించామని భట్ చెప్పారు. అలాగే, పండుకేశ్వర్ దగ్గర మరో హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్ ఏర్పాటు చేశామన్నారు. దోబట, హైనా, బద్రినాథ్ దామ్ యాత్రికుల కోసం ఈ క్యాంప్ ఏర్పాటు చేశామన్నారు.
Chardham Yatra: మే 6న తెరుచుకోనున్న కేదార్నాథ్ ఆలయ ద్వారాలు: చార్ ధామ్ యాత్ర వివరాలు

Uttarakhand Char Dham Yatra 31 pilgrims die due to high BP, heart attack in 12 days
ఈ స్క్రీనింగ్ లో యాత్రికుల్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు కనిపిస్తే.. రెస్ట్ తీసుకోవాలని లేదా ఆరోగ్యంగా, ఫిట్ గా అయ్యాకే యాత్రకు వెళ్లాలని సూచిస్తున్నారు. మే 3న భక్తుల కోసం గంగోత్రి, యమునోత్రి పోర్టల్స్ ప్రారంభంతో చార్ ధామ్ యాత్ర మొదలైంది. పరమ శివుడు కొలువైన కేథార్ నాథ్ మే 6న పున:ప్రారంభించారు. ఇక మే 8న బద్రినాథ్ ను రీఓపెన్ చేశారు. మరోవైపు చార్ ధామ్ యాత్రలో వీఐపీ దర్శనాలకు స్వస్తి పలికారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి. భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని, కావున, హిమాలయాల్లో ఉంటే ఆలయాల్లో వీఐపీ దర్శనాలకు ముగింపు పలకాలన్నారు. ఈ ఏడాదిలో చార్ ధామ్ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి 3లక్షల మందికి పైగా యాత్రికులు చార్ ధామ్ ను సందర్శించారు.

Uttarakhand Char Dham Yatra 31 pilgrims die due to high BP, heart attack in 12 days