Char Dham Yatra: జులై1న మొదలుకావాల్సిన ఛార్‌ధామ్‌ యాత్ర రద్దు

ఛార్‌ధామ్‌ యాత్ర ఆరంభం కావడానికి కొద్ది రోజుల ముందే రద్దు చేస్తున్నట్లుగా ఉత్తరాఖాండ్ ప్రభుత్వం ప్రకటించింది. గురువారం నుంచి మొదలుకావాల్సిన యాత్రకు సంబంధించి...

Char Dham Yatra: జులై1న మొదలుకావాల్సిన ఛార్‌ధామ్‌ యాత్ర రద్దు

Char Dham Yatra (1)

Updated On : June 29, 2021 / 7:44 PM IST

Char Dham Yatra: ఛార్‌ధామ్‌ యాత్ర ఆరంభం కావడానికి కొద్ది రోజుల ముందే రద్దు చేస్తున్నట్లుగా ఉత్తరాఖాండ్ ప్రభుత్వం ప్రకటించింది. గురువారం నుంచి మొదలుకావాల్సిన యాత్రకు సంబంధించి ఉత్తరాఖాండ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. తీర్థ యాత్రకు కేవలం మూడు జిల్లాలకు చెందిన వారు మాత్రమే రావాలని స్టే విధించిన మరుసటి రోజే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

గత వారమే ఛార్ ధామ్ యాత్రను జులై 1నుంచి స్థానికులకు.. పరిమిత సంఖ్యలో ఓపెన్ చేయాలని ప్లాన్ చేసింది. చమోలీ, ఉత్తర్ కాశీ, రుద్రప్రయాగ్ జిల్లాలకు చెందిన బద్రీనాథ్, కేదర్ నాథ్, యమునోత్రి, గంగోత్రి ప్రాంతాల్లోని ఆలయాలను సందర్శించుకోవాలని అనుకున్నారు.

తిరాథ్ సింగ్ రావత్ ప్రభుత్వం.. ముందుగా తీర్థయాత్రను కొవిడ్-19 పరిస్థితుల కారణంగా రద్దు చేసింది. ఆ తర్వాత పరిమిత సంఖ్యలో నిర్వహించాలని ప్లాన్ చేసింది. హైకోర్టులో దీనిని ఛాలెంజ్ చేయగా.. కొవిడ్-19 గైడ్ లైన్స్ రీత్యా హరిద్వార్ లోని కుంభమేళా పరిస్థితులను ప్రస్తావిస్తూ రద్దు చేశారు.