వాలెంటైన్స్ డే : లవర్ ఫోటో కాల్చేస్తే : విచిత్రమైన ఆఫర్ 

  • Published By: veegamteam ,Published On : February 14, 2019 / 07:44 AM IST
వాలెంటైన్స్ డే : లవర్ ఫోటో కాల్చేస్తే : విచిత్రమైన ఆఫర్ 

బెంగళూరు : ఏదన్నా ప్రత్యేక సందర్భం  వస్తే హోటల్స్ వ్యాపారులు..బట్టలు..బంగారం వ్యాపారులు కస్టమర్స్ ను ఆకట్టుకునేందుకు పలు ఆఫర్స్ పెడుతుంటారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే (ప్రేమికులు దినోత్సవం) రోజున  బెంగళూరులోని ఓ రెస్టారెంట్ యువతీయువకులకు విచిత్రమైన ఆఫర్ ఇచ్చింది. మీ మాజీ ప్రియుడు లేదా ప్రియురాలి ఫొటోను తగలబెడితే భోజనం అనంతరం ఫ్రీగా డెస్సర్ట్ (స్వీట్ లేదా ఐస్ క్రీమ్)ను అందిస్తామని బెంగళూరుకు చెందిన రౌండప్ కేఫ్  ప్రకటించింది.దీనిపై నెటిజన్స్ నుంచి డిఫరెంట్ రెస్పాండ్ అయ్యారు. ఈ ఐడియా నిజంగా బాగుందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడగా..ప్రేమికుల దినోత్సవం రోజున ఇలాంటి పిచ్చిపనులు ఏంటని మరికొందరు మండిపడుతున్నారు.

చిత్ర విచిత్రమైన ఆఫర్స్ తో ఆయా సెలబ్రేషన్స్ ను క్యాష్ చేసుకోవటం పలు రెస్టారెంట్స్ సర్వసాధారణంగా జరిగేదే. ఈ క్రమంలో మాజీ ప్రేమికులపై ప్రస్తుతం వారికి వుండే కోపాన్ని..నిరసనను రౌండప్ కేఫ్ రెస్టారెంట్ తన పబ్లిసిటీకి వాడుకుంటోందనే ఇంకొందరు నెటిజన్స్ విమర్శిస్తున్నారు.