ఓటు వెయ్యకపోతే శపిస్తాను : బీజేపీ ఎంపీ

  • Published By: venkaiahnaidu ,Published On : April 12, 2019 / 03:35 PM IST
ఓటు వెయ్యకపోతే శపిస్తాను : బీజేపీ ఎంపీ

Updated On : April 12, 2019 / 3:35 PM IST

తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు ఉన్నావో బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్.ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేయనివాళ్లకు పాపాలు చుట్టుకుంటాయని శాపిస్తున్నారు.సన్యాసులు అడిగితే కాదనకూడదు అంటూ తనదైన శైలిలో ఓట్లు అభ్యర్థిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం(ఏప్రిల్-12,2019)ఓ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ…నేను ఓ సన్యాసిని. సన్యాసి అనేవాడు ఏదైనా అడిగినప్పుడు అది ఇవ్వకుంటే…ఎదుట వాళ్ల పుణ్యాలన్నీ ఆ సన్యాసికి సంక్రమిస్తాయి. కాదన్న వాళ్లకు పాపాలొచ్చి చుట్టుకుంటాయి.ఈ మాటలు స్వయంగా శాస్త్రేలే ఘోషిస్తున్నాయ.నేను స్థలం,డబ్బు అడగటం లేదు.ఓటు వేయమని అడుగుతున్నాను.నేను సన్యాసిని.మీరు గెలిపిస్తే నేను విజయం సాధిస్తాను.లేకుంటే గుడిలో భజన,కీర్తన చేసుకుంటాను.ఈ రోజు ఇక్కడికి ఓట్లు అడగటానికి వచ్చాను.మీరు నాకు ఓటు వెయ్యకపోతే మీ కుటుంబానికి సంతోషాన్ని దూరం చేస్తాను.నేను శపిస్తాను.  అని అన్నారు.

గతంలో కూడా అనేకసార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో సాక్షి మహరాజ్ వార్తల్లో నిలిచారు.మోడీ మళ్లీ ప్రధాని అయితే దేశంలో ఇక ఎన్నికలు జరుగవు అంటూ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి.రాజకీయాల్లోకి యోగులు, సన్యాసులు అడుగుపెట్టడంతో ఓట్లడిగే పద్ధతుల్లోనూ మార్పులు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే.