వెడ్డింగ్ కార్డ్ ప్రచారం…పెళ్లికి వచ్చే ముందు మోడీకి ఓటెయ్యండి

  • Published By: venkaiahnaidu ,Published On : March 17, 2019 / 11:30 AM IST
వెడ్డింగ్ కార్డ్ ప్రచారం…పెళ్లికి వచ్చే  ముందు మోడీకి ఓటెయ్యండి

 మోడీపై ఉన్న అభిమానాన్ని కాస్త భిన్నంగా చూపించాలనుకుని ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఓ వ్యక్తి ఈసీకి దొరికిపోయాడు. చివరకు ఎన్నికల సంఘానికి క్షమాపణలు చెప్పాడు.ఉత్తరాఖాండ్ లో ఈ ఘటన జరిగింది.
ఉత్తరాఖాండ్ కు చెందిన జగదీశ్‌ చంద్ర జోషి అనే వ్యక్తి తన కుమారుడి పెళ్లి పత్రికల్లో.. బహుమతులు తీసుకురావద్దు. వధూవరులను ఆశీర్వదించడానికి ముందు..దేశహితం కోరి ఏప్రిల్-11న జరిగే పోలింగ్‌ లో మోడీకి ఓటెయ్యండి అని రాయించాడు. అదే తమకు ఇచ్చే బహుమానమని తెలిపాడు.ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఈసీ దీన్ని ఉల్లంఘన కింద భావించింది. జగదీశ్ కు రిటర్నింగ్‌ అధికారి నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లో వ్యక్తిగతంగా ఈసీ ముందు హాజరుకావాలని ఆదేశించారు.దీనిపై స్పందించిన జోషి ఈ విషయంపై తాను ఎన్నికల సంఘాన్ని క్షమాపణలు కోరుతున్నానన్నారు. తనకు తెలియకుండా తన పిల్లలు ఈ పని చేశారని వివరించాడు. తాను ఏ పార్టీలో క్రియాశీలకంగా పనిచేయడం లేదని తెలిపారు