Priyanka Gandhi: వయనాడ్ అభ్యర్థిగా ప్రియాంకా గాంధీ.. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి..
కేరళ రాష్ట్రంలోని వయనాడ్ పార్లమెంట్ స్థానంకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. గాంధీ కుటుంబానికి చెందిన, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి..

Priyanka Gandhi Vadra
Priyanka Gandhi Vadra: మహారాష్ట్ర , జార్ఖండ్ రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికలతోపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో 48 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ ను విడుదల చేసింది. గత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్ బరేలి నియోజకవర్గాల నుంచి పోటీ చేశాడు. రెండు చోట్లా విజయం సాధించాడు. వయనాడ్ స్థానాన్ని రాహుల్ వదులుకోవడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో రాహుల్ గాంధీ రాజీనామా చేసిన వయనాడ్ (కేరళ రాష్ట్రం) లోక్ సభ స్థానానికి నవంబర్ 13న, సిట్టింగ్ ఎంపీ మృతితో ఖాళీ అయిన మహారాష్ట్రలోని నాందేడ్ లోక్ సభ స్థానంకు నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి.
కేరళ రాష్ట్రంలోని వయనాడ్ పార్లమెంట్ స్థానంకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. గాంధీ కుటుంబానికి చెందిన, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పేరును ప్రకటించింది. దీంతో తొలిసారి ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్నారు. వయనాడ్ నుంచి ప్రియాంక విజయం సాధిస్తే చట్టసభల్లోకి తొలిసారి అడుగు పెట్టనున్నారు. అంతేకాదు.. ఒకే సారి ముగ్గురు గాంధీ కుటుంబ సభ్యులు చట్ట సభల్లో ఉంటారు. ఇప్పటికే సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. రాహుల్ లోక్ సభ సభ్యుడు. ప్రియాంక గెలిస్తే లోక్ సభ సభ్యురాలు అవుతారు. నవంబర్ 13న వయనాడ్ లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఫలితాలు వెల్లడికానున్నాయి.
Also Read: ఫస్ట్ టైమ్ ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఫెయిల్..! అసలు హెజ్బొల్లా ఎలాంటి డ్రోన్లను పంపింది?
కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లోక్ సభ స్థానంకు, పాలక్కడ్, చెళక్కర అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13న పోలింగ్ జరగనుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఈ మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. లోక్ సభ నియోజకవర్గం నుంచి ప్రియాంక గాంధీ వాద్రా, పాలక్కడ్ నుంచి రాహుల్ మామ్‌కుటథిల్, చెళక్కర (ఎస్సీ) నియోజకవర్గం నుంచి రమ్య హరిదాస్ పేర్లను కాంగ్రెస్ ప్రకటించింది.
Congress President Shri @kharge has approved the proposal to nominate the following members as party candidates for the bye-elections to the Lok Sabha and Legislative Assembly from Kerala pic.twitter.com/QBFskzozEB
— Congress (@INCIndia) October 15, 2024