కూతుర్ని కిడ్నాప్ చేయించిన బీజేపీ నేత

  • Published By: veegamteam ,Published On : February 18, 2019 / 05:24 AM IST
కూతుర్ని కిడ్నాప్ చేయించిన బీజేపీ నేత

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కూతుర్ని కిడ్నాప్ చేయించి ఏమీ తెలియనట్లు ఇన్ని రోజులు నటించడమే గాక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువతి కోసం గాలించిన పోలీసులకు ఆచూకీ దొరక్కపోవడంతో అనుమానం వచ్చి తండ్రిని ప్రశ్నించడంతో కిడ్నాప్ గుట్టు బయటపడింది. 

తన ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో చొరబడ్డారు. తుపాకీతో బెదిరించి ఇంట్లో ఉన్న అతడి కూతుర్ని లాక్కెళ్లారు. తర్వాత ఈ కిడ్నాప్ వెనుక తృణమూల్‌ కాంగ్రెస్‌ హస్తముందంటూ డ్రామాలు మొదలు పెట్టారు. రోడ్డుపై ధర్నా చేసి హంగామా చేశారు. ఇటు ఈ ఘటనపై పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంటి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో అనుమానం వచ్చింది. వెంటనే సుప్రభాత్ తీరు కూడా తేడా కొట్టడంతో.. అతడ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దీంతో నిజం ఒప్పుకున్నాడు.. తన ఇంట్లో పనిచేసే ఇద్దరు వ్యక్తులతో కలిసి తానే కిడ్నాప్ డ్రామా ఆడినట్లు చెప్పాడు. 

సుప్రభాత్‌తో పాటూ కిడ్నాప్‌కు సహకరించిన ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబ వివాదంతో పాటూ పొలిటికల్ మైలేజ్ కోసం (సానుభూతి పొందేందుకు) కిడ్నాప్ డ్రామా ఆడినట్లు సుప్రభాత్ పోలీసులకు చెప్పాడు. కూతుర్ని కిడ్నాప్ చేసిందేకాక.. ప్రత్యర్థి పార్టీపై ఆ తప్పును నెట్టిన BJP నేత జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు.