మరాడు అపార్ట్ మెంట్ల కూల్చివేత ముందు జరిగిందిదే

కేరళ ప్రభుత్వం ఇచ్చిన గడువు ప్రకారం 138 రోజుల్లోగా మరాడులో అక్రమంగా నిర్మించిన నాలుగు అపార్ట్ మెంట్లు కూల్చివేయాలని గతేడాది సెప్టెంబర్ లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మరాడు మున్సిపాల్టీలో అక్రమంగా నిర్మించిన నాలుగు భారీ లగ్జరీ అపార్ట్‌మెంట్లను 800కిలోల పేలేడు పదార్థాలను ఉపయోగించి అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. అసలు ఈ బిల్డింగ్ లను ఎందుకు కూల్చివేశారు,కూల్చివేతకు ముందు ఏం జరిగిందనేది చూద్దాం.
అపార్లమెంట్లలోని నివాసితులకు ఏం జరిగింది?
మరదులోని 350 ఫ్లాట్లు ఉన్న నాలుగు అపార్ట్ మెంట్లలో నివాసం ఉంటున్న 246కుటుంబాలుకు తమ తమ ఫ్లాట్లను ఖాళీ చేయాలని కేరళ ప్రభుత్వం వారికి సెప్టెంబర్-24,2019న నోటీసులు జారీ చేసింది. ఈ అపార్ట్ మెంట్ల నిర్మాణం అక్రమేనని,సెప్టెంబర్-27,2019న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అపార్ట్ మెంట్ లకు విద్యుత్తు మరియు నీటి సరఫరాను అధికార యంత్రాంగం నిలిపివేసింది. కాని ఆ అపార్ట్ మెంట్లలో నివసించేవాళ్లు మాత్రం తమ ఫ్లాట్లను వదిలిపెట్టి వెళ్లేది లేదని చెప్పారు. అధికారులు మమ్మల్ని వీధుల్లోకి నెట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు. మేము దోషులు కాదు. మేము మా ఇళ్లను వదిలి వెళ్ళము. మేము ఇక్కడే ఉంటాము అని ఫ్లాట్ యజమానుల ప్రతినిధి ఒకరు ఆ సమయంలో చెప్పారు. చాలా రోజుల పాటు ఆ అపార్ట్ మెంట్లలో నివసించే కుటుంబాలు తమ నిరసన వ్యక్తం చేశాయి. ఆ అపార్ట్ మెంట్లలో నివసించే ఓ వ్యక్తి దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను కూడా సుప్రీం కోర్టు విచారించేందుకు నిరాకరించింది. అయితే ఆ అపార్ట్‌మెంట్లలోని ప్రతి ఒక ఫ్లాట్ ఓనర్‌కు 25 లక్షల నష్టపరిహారాన్ని చెల్లించాలని అక్టోబర్ లో అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
ఫ్లాట్ బిల్డర్స్ కి ఏం జరిగింది?
కోస్టల్ రెగ్యులేషన్ జోన్ చట్టం అమలులోకి వచ్చే ముందు అపార్ట్ మెంట్ల నిర్మాణానికి తమకు అనుమతులు వచ్చాయని సుప్రీంకోర్టు తీర్పుకి ముందు బిల్డర్స్ తెలిపారు. తమను బిల్డర్స్ మోసం చేశారని ఫ్లాట్ ఓనర్లు కంప్లెయింట్ చేయడంతో సెప్టెంబర్ లో బిల్డర్స్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్స్ 406,420 కింద ముగ్గురు బిల్డర్లపై కేసులు నమోదు చేసినట్లే సిటీ పోలీస్ కమిషనర్ తెలిపారు. కోర్టు ఆర్డర్స్ ప్రకారం ముగ్గురు బిల్డర్ల బ్యాంకు అకౌంట్లు స్థంభింపజేశారు. కంపెనీ డైరక్టర్లను రాష్ట్ర క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ తర్వాత వాళ్లు బెయిల్ పై విడుదలయ్యారు. ఇద్దరు మరదు పంచాయత్ అధికారులను కూడా అక్రమ కట్టడాలకు అనుమతిచ్చారని అరెస్ట్ చేశారు.
మరదు ఎక్కడ ఉంది?
కొచ్చికి కూతవేటు దూరంలో మరదు మున్సిపాలిటీ ఉంది. 12.35స్క్వేయర్ కిలోమీటర్ల మేర మరదు మున్సిపాలిటీ విస్తరించి ఉంది. రెండు నేషనల్ హైవేలు NH-47,NH-47(A) ఈ ఏరియా గుండా వెళ్లాయి.
సుప్రీం కోర్టు ఏం చెప్పింది?
కేరళ తీరప్రాంతాల్లో అక్రమ నిర్మాణం పర్యావరణానికి భారీ నష్టమని చెప్పింది. ప్రకృతికి ఎంతవరకు వినాశనం జరిగిందో అంచనా వేయడానికి ఒక సర్వే నిర్వహించాలని కోర్టు కేరళ చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. ఈ అంశంపై సెప్టెంబర్ 27 న వివరణాత్మక ఉత్తర్వు జారీ చేస్తామని చెప్పారు.
68,028.71 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న నాలుగు బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్ భవనాల్లో 343 ఫ్లాట్లు ఉన్నాయని ప్రభుత్వం తన అఫిడవిట్‌లో ఫ్లాట్ల సంఖ్య మరియు ఈ ప్రాంత జనాభా వివరాలను ఇచ్చింది.
నోటిఫైడ్ CRZలో నిర్మించిన బిల్డింగ్ లను ఓ నెలలోగా వాటిని తొలగించాలని మే-8,2019లో ఇచ్చిన తీర్పుని సమీక్షించాలని కోరుతూ జూలై 2019న రియల్టర్స్ చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.
కూల్చివేత ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆ ప్రాంత వాసులు చేసిన పిటిషన్ ను కోర్టు అంతకుముందు తిరస్కరించింది. సుప్రీంకోర్టు యొక్క వేసవి విరామ సమయంలో వెకేషన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులకు బలమైన మినహాయింపు ఇచ్చింది. ఇది ఆరు వారాల పాటు భవనాలను కూల్చివేతపై స్టే విధించింది