IMD Colours Alerts : భారీ వర్షాలు.. రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ అంటే ఏంటి? ఏం రంగు దేనికి సూచన..?
భారత వాతావరణ శాఖ (IMD) రంగుల విధానాన్ని ప్రవేశపెట్టింది. విపత్తు నిర్వహణ శాఖ వీటిని ప్రకటిస్తుంది. వాతావరణం గురించి చెప్పే పదాలను సరళతరం చేయటానికి ఈ రంగులను బట్టి ప్రకటిస్తారు అధికారులు. అందరికి అర్థమయ్యేవిధంగా ఉండటానికి ఈ రంగుల విధానం ఉంటుంది

IMD red,orange,yellow alertas issues
IMD red, orange, yellow alerts issues : ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తున్నాయి. వరదలతో ఉత్తరాది అతలాకుతంగా మారిపోయింది. పొంగుతున్న వాగులు,వంకలు, నదులు ప్రజల్ని నిరాశ్రయుల్ని చేశాయి. దీంతో పలు ప్రాంతాల్లో ఆయా వర్షాల ప్రభావాన్ని బట్టి అలర్ట్ ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్ లో భారీవర్షాలు కురుస్తున్న క్రమంలో రాష్ట్రంలోని సోలాన్, సిమ్లా, సిర్మావూర్, కుల్లూ, మండీ, కిన్నౌర్, లాహౌల్ జిల్లాల్లో వాతావరణ శాఖాధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరికొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్, ఇంకొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్. అసలీ రంగుల పేరుతో అలర్ట్ ఏంటీ.. ఆ రంగుల సంకేతమేంటీ..? అని ఎప్పుడైనా మీరు డౌట్ వచ్చిందా? ఈ రంగుల తేడాలేంటీ..ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి రంగు అలర్ట్ ప్రకటిస్తారు..? అనే ఆసక్తికర అంశాల గురించి తెలుసుకుందాం.
Heavy Rains: ఉత్తరాదిని ముంచెత్తిన వాన.. వరదలు, పిడుగులకు యూపీలో 34 మంది మృతి
భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించే ఈ రంగుల అలర్ట్ గురించి ఆసక్తికర అంశాల వెనుక హెచ్చరికలు ఉంటాయి. వర్షాలు కురిసినప్పుడు పసుపు (Yellow Alert) , నారింజ (Orange Alert) , ఎరుపు రంగు (Red Alert)ల పేరుతో హెచ్చరికలు ఇస్తుంటుంది వాతావరణ శాఖ. ఏరంగు వార్నింగ్ వచ్చినప్పుడు అప్రమత్తమవ్వాలని అనే విషయాలు ప్రతీ ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాతావరణ పరిస్థితులను అంచనా వేసే అధికారులు ఆయా ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులను అంచనా వేసి దాని తీవ్రతను గుర్తిస్తారు. అనంతరం వాతావరణ తీవ్రను తెలియజేయటానికి ఈ రంగుల పేర్లు వినియోగిస్తారు.
భారత వాతావరణ శాఖ (IMD) రంగుల విధానాన్ని ప్రవేశపెట్టింది. విపత్తు నిర్వహణ శాఖ వీటిని ప్రకటిస్తుంది. వాతావరణం గురించి చెప్పే పదాలను సరళతరం చేయటానికి ఈ రంగులను బట్టి ప్రకటిస్తారు అధికారులు. అందరికి అర్థమయ్యేవిధంగా ఉండటానికి ఈ రంగుల విధానం ఉంటుంది. శాంకేతికంగా చెబితే అర్థంకాని విషయాలు వాడుక భాషలో చెబితే ఎలా అర్థమవుతుందో అలాగే వాతావరణ శాఖ పదాల్లో అర్థం కాని విషయాలను ఇలా రంగుల పేర్లతో ఎక్కువమందికి సులభంగా విషయం అర్థమవుతుందనేది దీని ఉద్దేశం. అందుకే రంగుల విధానం.
తొలి రోజుల్లో ఆకుపచ్చ రంగు, పసుపు, నారిజం, ఎరుపు అంటూ నాలుగు రకాల రంగులు వాడేవారు. ఆకుపచ్చ అంటే ఎటువంటి చర్యలు అవసరంలేదని..అంటే ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండవని అర్థం. అదే పసుపు రంగు అంటే సిద్ధంగా ఉండమని అంటే ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఎదురైనా సిద్ధంగా ఉండమని సంకేతం. అలాగే నారింజ్ రంగు అంటే అప్రమత్తంగా ఉండాలని అర్థం. అదే ఎరుపు అంటే చర్యలు తీసుకోవాలని అర్థం.
ఉదాహరణకు తక్కువ వర్షపాతం నమోదు అయితే గ్రీన్ కలర్. అంటే 24 గంటల్లో 65 మిమీటర్ల కంటే తక్కువ వర్షపాతం నమోదు అయితే గ్రీన్ అన్నమాట. అంతకంటే ఎక్కువ అంటే 115.5మి.మీటర్ల నమోదు అయితే ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు. ఒక్కరోజులో 115.6 నుంచి 204.4 మి.మీటర్ల వర్షపాతం నమోదు అయితే ఆరెండ్ అలర్ట్. అలాగే 24గంటల వ్యవధిలో 204.5 మి.మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయితే రెడ్ అలర్ట్ జారీ చేయబడుతుంది.
స్కీమ్ ఆధారంగా రంగుల కేటాయింపు..
ఈ రంగుల కేటాయింపును ఐఎండీ ఎలా గుర్తిస్తుంది అంటే.. ఐదు రోజుల వాతావరణ స్కీమ్ ఆధారంగా నిర్ణయిస్తూంటుంది. మెట్రోలాజికల్ అంశాలు, హైడ్రోలాజికల్ అంశాలు, జియోఫిజికల్ ఫ్యాక్టర్స్ పరిగణలోకి తీసుకొని వర్షాల తీవ్రతను అంచనా వేసి అందుకు తగ్గ రంగు హెచ్చరికలు జారీ చేస్తారు. దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ ఇదే కలర్ కోడ్‌ను వినియోగిస్తారు. కాగా.. ఆ హెచ్చరికలతో పాటు సబ్ డివిజన్ వార్నింగ్ మాత్రం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది.
ఆకుపచ్చ రంగు (Green Yellow Alert)
వర్షం పడే అవకాశం లేని సమయాల్లో వాతావరణ శాఖ ఆకుపచ్చ రంగును చూపిస్తుంది. అంటే సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కాస్త లైట్ గా వర్షం పడే సూచనలు ఉంటేనే ఆకుపచ్చ నుంచి రంగు మారుతుంది.
పసుపు అలర్ట్ (Yellow Alert)
ఎల్లో అలర్ట్ అంటే ప్రజలను అప్రమత్తం చేయడానికి ఇస్తారు. ప్రమాదక పరిస్థితుల రాబోతున్నాయని అప్రమత్తంగా (జాగ్రత్తగా ) ఉండాల్సిన అవసరం ఉందని తెలిపేందుకు సూచనగా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. అంటే దాని ఉద్దేశం అలర్ట్ గా ఉండమని చెప్పడం.
ఆరెంజ్ అలర్ట్ (Orange Alert)
ఎల్లో అలర్ట్ అనేది ఆరెంజ్ అలర్ట్‌గా మారుతుంది. వాతావరణ పరిస్థితులు మరింత దిగజారినప్పుడు ఆరెంజ్ అలర్ట్ ఇస్తారు. వర్షాల వల్ల రోడ్డు రవాణా, విమానాల రాకపోకలకు అంతరాయం, ఆస్తినష్టం, ప్రాణనష్టం కూడా జరిగే అవకాశం ఉన్న సమయాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తారు.
రెడ్ అలర్ట్ (Red Alert)
రెడ్ అలర్ట్ అంటే డేంజర్ పరిస్థితి. సహజంగా తుఫాన్లు వచ్చినప్పుడు, 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ భారీ వర్షాలు కురుస్తాయనే అంచనా ఉన్నప్పుడు వాతావరణ శాఖ అధికారులు ఇలా రెడ్ అలర్ట్ జారీ చేస్తారు. వాతావరణం డేంజర్ లెవల్స్ దాటినప్పుడు, ఎక్కువ ఆస్తి, ప్రాణ నష్టాలు, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని భావించినప్పుడు రెడ్ అలర్ట్ ఇష్యూ చేస్తారు.
దీంతో పాటు సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులను కూడా దీనికి తగినట్టు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెబుతారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన సమయం. అని అర్థం చేసుకోవాలి.
కాగా.. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, హిమాచల్, ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తుంది. ఉత్తరాఖండ్, హిమాచల్, పంజాబ్, రాజస్థాన్‌లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వంతెనలు, రోడ్లు, రైల్వే ట్రాక్‌లు దెబ్బతిన్నాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఢిల్లీలో 41 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. ఢిల్లీ ఎన్సీఆర్‌లో 33 గంటల్లో 258.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. వర్షాల ప్రభావంతో ఢిల్లీలో పాఠశాలలు మూసివేశారు. సోమవారం ఎల్లో అలర్ట్ జారీ చేశారు.