Zojilla Tunnel : ఆసియాలోనే పొడవైన బై డైరెక్షనల్ టన్నెల్ ఎక్కడంటే?
ప్రస్తుతం శ్రీనగర్ నుండి లేహ్ ప్రయాణం హిమాయల గుండా సాగుతుంది. ఇక్కడి రహదారులు వాతావరణం వాహనాల ప్రయాణానికి ఏమాత్రం అనుకూలంగా లేదనే చెప్పాలి. శీతాకాలంలో ఆరుమాసాలపాటు ఈ రహదారి

Zojilla Pss
Zojilla Tunnel : భారత దేశంలో శ్రీనగర్-లేహ్ లను కలుపుతూ నిర్మిస్తున్న జోజిలా టన్నెల్ కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. సోనా మార్గ్, కార్గిల్ మధ్య ఉన్న ఈ జోజిలా టన్నెల్ నిర్మాణం సాగుతుంది. దేశంలోనే పొడవైన టన్నెల్ గా దీనిని చెప్పవచ్చు. ఆసియాలో పొడవైన బై డైరెక్షనల్ టన్నెల్ కూడా ఇదేనని చెప్పవచ్చు. చాలా క్లిష్టమైన పరిస్ధితిలో అధునాతనమైన టెక్నాలజీ వినియోగించటం ద్వారా దీని నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు.
ప్రస్తుతం శ్రీనగర్ నుండి లేహ్ ప్రయాణం హిమాయల గుండా సాగుతుంది. ఇక్కడి రహదారులు వాతావరణం వాహనాల ప్రయాణానికి ఏమాత్రం అనుకూలంగా లేదనే చెప్పాలి. శీతాకాలంలో ఆరుమాసాలపాటు ఈ రహదారి మూసివేస్తారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణం సాగించటమంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈక్రమంలోనే సోనామార్గ్ నుండి కార్గిల్ మీదగా లేహ్, లడఖ్ కు టన్నెల్ రహదారి నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది.
సింగిల్ ట్యూబ్ టన్నెల్‌గా పిలిచే ఈ జోజిల్ల రహదారిలో రెండు వైపులా ప్రయాణించే (బై డైరెక్షనల్ ట్రాఫిక్) రెండు లైన్ల రహదారి నిర్మిస్తున్నారు. సముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తులో 14.2 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణం జరుగుతుంది. 9.5 మీటర్ల వెడల్పు, 7.57 మీటర్ల ఎత్తుతో రెండు వరుసల్లో టన్నెల్ నిర్మాణం చేస్తున్నారు.
ఈటన్నెల్ నిర్మాణం పూర్తయి రహదారి అందుబాటులోకి వస్తే సంవత్సరపొడవునా శ్రీనగర్, లడఖ్ ల మధ్య వాహనాల రాకపోకలు సాగించే వీలుకలుగుతుంది. టన్నెల్ అందుబాటులోకి వస్తే బాల్టల్, మినామార్గ్ లమధ్య దూరం 40 కిలో మీటర్ల నుండి 13 కిలోమీటర్లకు తగ్గ నుంది. మంచు తుఫానులు వచ్చినా ఎలాంటి ప్రమాదం వాటిల్ల కుండా క్యాచ్ డ్యామ్స్, ఎయిర్ బ్లాస్ట్, ప్రొటెక్షన్ గోడలు, డిఫ్లెక్టర్ డ్యామ్స్ ను నిర్మిస్తున్నారు.