Modi–Putin meeting : మోదీ, పుతిన్ భేటీలో ప్రత్యేక ఆకర్షణగా ఓ మొక్క.. దీనికి గురించి తెలుసా..? అక్కడ ఎందుకు ఉంచారంటే?

పుతిన్, మోదీల మధ్య ఉన్న మొక్క పేరు హెలికోనియా (Heliconia). అది కేవలం అలంకార వస్తువు కాదు. పాజిటివ్ ఎనర్జీకి సూచికగా

Modi–Putin meeting : మోదీ, పుతిన్ భేటీలో ప్రత్యేక ఆకర్షణగా ఓ మొక్క.. దీనికి గురించి తెలుసా..? అక్కడ ఎందుకు ఉంచారంటే?

Heliconia plant

Updated On : December 6, 2025 / 9:18 AM IST

Modi–Putin meeting Heliconia plant : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన విజయవంతంగా సాగింది. పుతిన్‌, ప్రధాని నరేంద్రమోదీ మధ్య ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో శుక్రవారం ద్వైపాక్షిక భేటీ జరిగిన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య మొత్తం 11 కీలక ఒప్పందాలు కుదిరాయి. ఆరోగ్యం, ఆహార భద్రత, నౌకాయానం, ఎరువులు, విద్య, భారత్ నుంచి రష్యాకు నిపుణులైన కార్మికుల వలస తదితర రంగాల్లో పరస్పర సహకారం పెంపునకు ఇవి దోహదపడనున్నాయి. అయితే, మోదీ, పుతిన్ భేటీ సమయంలో వారి మధ్యలో ఓ మొక్క ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో ఆ మొక్క ప్రత్యేకతలను తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు.

పుతిన్, మోదీల మధ్య ఉన్న మొక్క పేరు హెలికోనియా (Heliconia). అది కేవలం అలంకార వస్తువు కాదు. పాజిటివ్ ఎనర్జీకి సూచికగా దీన్ని పేర్కొంటారని మీడియాలో కథనాలు వస్తున్నాయి.

సాధారణంగా అత్యున్నతస్థాయి దౌత్య సమావేశాల కోసం సిద్ధం చేసే గదుల్లో ఏ వస్తువైనా సరే యాదృచ్ఛికంగా ఉంచరు. పూలు, రంగులు, సీటింగ్ అరేంజ్‌మెంట్, బ్యాక్‌గ్రౌండ్ వంటివి పక్కాగా ఉండేలా చూసుకుంటారు. ఈ క్రమంలో భారత్ – రష్యా దేశాల మధ్య స్నేహ సంబంధానికి, ద్వైపాక్షిక సహకార పురోగతికి ప్రతీకగా హెలికోనియా మొక్కను ఏర్పాటు చేసి ఉంటారని భావిస్తున్నారు. అయితే, మోదీ, పుతిన్ భేటీ సమయంలో ఈ మొక్కను ఉద్దేశపూర్వకంగా ఏర్పాటుచేశారా? యాదృచ్ఛికంగా జరిగిందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ మొక్క గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది.

Also Read: Rental Husband : అద్దెకు భర్తలు కావాలట..! కేవలం ఆ పనులకే.. పురుషులకు బంపర్ ఆఫర్.. ఆ ప్రాంతంలో విచిత్ర పరిస్థితి.. క్యూ కడుతున్నారు..

హెలికోనియా మొక్క గురించి..
హెలికోనియా ఒక ఉష్ణమండల మొక్క. దీని శక్తివంతమైన, అద్భుతమైన పువ్వులు భారతదేశ గొప్పతనాన్ని, ఉత్సాహాన్ని మరియు ఆతిథ్య సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ఈ మొక్కలు భారతీయ వాస్తుశిల్పం, తోట పనిలో అతర్భాగం. ఈ మొక్కను సానుకూల శక్తికి సూచికగా పేర్కొంటారు. దీనిని మోదీ, పుతిన్ భేటీ సమయంలో వారి మధ్యలో ఉంచడానికి ప్రధాన కారణాల్లో.. వృద్ధి, శ్రేయస్సు, సమతుల్యత, సామరస్యాలతో పాటు కొత్త ఆరంభాలకు ముందడుగులకు శుభపరిణామంగా ఈ మొక్కను భావిస్తారు.

Heliconia plant

హెలికోనియా మొక్కలో ఎరుపు, నారింజ రంగులను ఎంచుకోవడం కూడా ఉద్దేశపూర్వకంగానే జరిగిందని తెలుస్తోంది. భారతీయ సంస్కృతిలో ఎరుపు రంగు శుభం, ప్రేమ, శ్రేయస్సు, పవిత్రత సూచిస్తుంది. దౌత్యపరంగా ఈ రంగు రెండు దేశాల మధ్య బలమైన, స్నేహపూర్వక సంబంధాలను సూచిస్తుంది. ఈ రంగు వెంటనే చూపరుల దృష్టిని ఆకర్షిస్తుంది.

ఈ మొక్క సానుకూల శక్తి, శ్రేయస్సు, సమతుల్యత, కొత్త ప్రారంభాలతో ముడిపడి ఉంటుంది. దాని శక్తివంతమైన రంగులు, పైకి పెరుగుతున్న ఆకారం వృద్ధి, ముందుకు సాగే వేగానికి చిహ్నాలుగా కనిపిస్తాయి. దౌత్య చర్చల సమయంలో ఈ మొక్కలు గదికి సహజమైన ప్రశాంతమైన సమతుల్యతను తెస్తాయి. ఇది రెండు దేశాలు ముఖ్యమైన ప్రపంచ సవాళ్లను చర్చిస్తున్నప్పటికీ వారి సంబంధం స్థిరంగా, శాంతియుతంగా ఉంటుందని తెలియజేస్తుంది.