Dawood Ibrahim House: సనాతన్ స్కూల్‌గా దావూద్ ఇబ్రహీం ఇల్లు
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం ఇల్లు సనాతన్ స్కూల్‌గా మారబోతుంది.

Dawood Ibrahim House: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం ఇల్లు సనాతన్ స్కూల్‌గా మారబోతుంది. మహారాష్ట్ర రత్నగిరిలోని అండర్ వరల్డ్ డాన్ దావూద్ విలాసవంతమైన ఇల్లుని స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మానిప్యులేటర్స్ యాక్ట్(సఫెమా) కింద వేలంలో అజయ్ శ్రీవాస్తవ అనే లాయర్ దక్కించుకున్నారు. వేలంలో దావూద్ ఇంటిని దక్కించుకున్న న్యాయవాది శ్రీవాస్తవ మాట్లాడుతూ.. నేను ఈ బంగ్లాను సనాతన్ పాఠశాలగా మార్చాలని భావిస్తున్నానని చెప్పారు.
లాయర్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, “దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లో మదర్పాలను బాగా ప్రోత్సహిస్తున్నాడని, ఇప్పుడు దావూద్ ఇల్లును సనాతన్ పాఠశాలగా మార్చాలని నేను భావిస్తున్నాను. దావూద్ పాకిస్తాన్‌లో హ్యాపీ లైఫ్ గడుపుతున్నాడు” అని అన్నారు. గతేడాది వేలంలో గ్యాంగ్‌స్టర్ రెండు విభిన్న ఆస్తులను కూడా శ్రీవాస్తవ కొనుగోలు చేశారు. అజయ్ శ్రీవాస్తవ ఈ ఇల్లును రూ.11లక్షల 20వేలకు కొన్నారు.
దావూద్ తోబుట్టువులతో బాల్యంలో..
దావూద్ ఇబ్రహీం 1980లలో ఇక్కడే ఉండేవాడని, చాలాకాలం వరకు.. దావూద్ ఇబ్రహీం నలుగురు అక్కచెల్లెళ్లతో ఇక్కడే ఉండేవారని చెబుతున్నారు. కానీ తరువాత దావూద్ కుటుంబం వేరే ప్రాంతానికి మారిందని, దావూద్ తండ్రి ఇబ్రహీం కస్కర్ ముంబై పోలీసు శాఖలో చేరినప్పుడు అతని కుటుంబం ఇక్కడికి రావడం మానేసిందని చెబుతున్నారు.
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌గా:
1993 ముంబై పేలుళ్ల తర్వాత, దావూద్ ఇబ్రహీం మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా మారారు. 2003లో దావూద్‌ని ప్రత్యేకంగా గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించింది అమెరికా. గతేడాది దావూద్ ఉనికిని పాకిస్తాన్ అంగీకరించింది. 1993 ముంబై బాంబు పేలుళ్ల వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన దావూద్‌ను అప్పగించాలని భారత్ పాకిస్తాన్‌ను నిరంతరం కోరుతోంది. దావూద్ కరాచీలోని సౌత్ పోర్ట్ సిటీలో ఉన్నాడు. గతేడాది తమ భూభాగంలోని 88 ఉగ్రవాద సంస్థలపై ఆంక్షలు విధించిన సమయంలో దావూద్ తమ దగ్గరే ఉన్నాడని పాక్ తొలిసారి అంగీకరించింది.