బ్యాండ్ పడుతుందా : ఎలక్షన్ అభ్యర్థులకు పెళ్లిళ్ల బెంగ

ఢిల్లీ: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు బ్యాంబ్ బాజా మ్రోగనుందా..పెళ్లి బాజా సౌండ్ వినపడితే చాలు హడలిపోతున్నారు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు. ఎందుకంటే ఇటు ఎన్నికల హడావిడి..మరో పక్క పెళ్లిళ్ల సందళ్లు ఒకేసారి మోగనున్నాయి. వేసవికాలం అంటే పెళ్లిళ్ళ కాలం అన్నట్లుగా మార్చి..ఏప్రిల్ నెలలు వచ్చాయంటే చాలు..పెళ్లిళ్లు ఎక్కువ సంఖ్యలో జరుగుతుంటాయి. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికల తేదీలు ప్రకటించినప్పటి నుంచి రాజకీయ పార్టీలు, నేతల్లో కలవరం మొదలైంది.
ముఖ్యంగా ఉత్తర భారతంలో ఎన్నికలు నిర్వహణ జరిగే తేదీలలో ఎక్కువ శాతం వివాహా ముహూర్తాలు ఉన్నాయి. దీంతో ఆయా తేదీలలో వివాహాలు ఎక్కువ మొత్తంలో జరగనున్నాయి. దీంతో అభ్యర్థులు ఓటింగ్ శాతం తగ్గుతుందని భయపడుతున్నారు. సాధారణంగా మార్చి, ఏప్రిల్ మాసాల్లో వివాహాలు జరుగుతుంటాయి. ఎన్నికల తేదీలలో వివాహాలు నిర్వహిస్తే ఇబ్బందులు ఎదురుకావచ్చని భావించి పలువురు ముహూర్తాలను కూడా వాయిదా వేసుకున్నట్లుగా సమాచారం. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల అభ్యర్థులు ర్యాలీలు నిర్వహిస్తుంటారు. దీంతో పలు మార్గాలు రష్ గా ఉంటాయి. ఇదే సమయంలో పెళ్లి ఏర్పాట్లకు కూడా పలు ఇబ్బందులు తలెత్తుతాయి. దీనికితోడు ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక బాధ్యతల రీత్యా సెలవులుకూడా ఉండవు. దీంతో వారు పెళ్లిళ్లకు వెళ్లలేకపోతారు. ఇక ఎన్నికల రోజునే వివాహం ఉంటే ఎవరూ వెళ్లలేని పరిస్థితి. ఇటువంటి భయాలతో అటు రాజకీయ నేతలు, సామాన్య ప్రజలు ఎన్నికలను తలచుకుని ఆందోళనకు గురవుతున్నారు.