అస్త్రశస్త్రాలతో పార్టీలు సిద్ధం : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

  • Published By: madhu ,Published On : November 17, 2019 / 02:34 PM IST
అస్త్రశస్త్రాలతో పార్టీలు సిద్ధం : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

Updated On : November 17, 2019 / 2:34 PM IST

పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది..రాఫెల్, అయోధ్య తీర్పులిచ్చిన జోష్‌తో బిజెపి యమా ఉత్సాహంగా సెషన్స్‌కి సిధ్దమవగా..నిరుద్యోగం, దేశ ఆర్ధిక స్థితిపై కౌంటర్లు ఇవ్వడానికి కాంగ్రెస్ అస్త్రాలు సిద్దం చేసుకుంది.. ఈ పరిణామాల మధ్య 2019, నవంబర్ 18వ తేదీ సోమవారం నుంచి సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి. 17వ లోక్‌సభ ఏర్పాటైన తర్వాత రెండో సెషన్స్ ‌కావడంతో కేంద్రం తన పట్టు నిరూపించుకునేందుకు సిధ్దమైంది. అటు కాంగ్రెస్ సహా విపక్షాలు కూడా తమ ఆయుధాలతో కేంద్రాన్ని నిలదీసేందుకు వ్యూహాలు రచించుకున్నాయి. 

మరోవైపు సమావేశాలు సాఫీగా సాగేందుకు పార్లమెంట్ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషి ఆద్వర్యంలో ఆల్‌పార్టీ భేటీ జరిగింది..పార్లమెంట్ లైబ్రరీ హాల్‌లో జరిగిన ఈ సమావేశంలో ప్రధాని మోదీ అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అలానే మొత్తం 25 నుంచి 30 దాకా కీలక బిల్లులకు ఈ సమావేశాలలో ఆమోదం పొందేలా వ్యూహం రచించింది ఎన్‌డిఏ.

ఈ శీతాకాల సమావేశాలలో 20 రోజుల పాటు సభ నడవనుందని తెలుస్తోంది. పార్టీ నిరుద్యోగం, ఆర్ధిక స్థితి వంటి కీలక అంశాలపై విపక్షాలు కేంద్రాన్ని నిలదీసేందుకు సిధ్దమవుతుండగా డ్యూటీలోని డాక్టర్లపై దాడి చేసే వారికి కఠినశిక్షలు… కార్పొరేట్ టాక్స్ తగ్గింపులు, ఈ – సిగరెట్ల నిషేధం వంటి ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులు తెచ్చేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. మరి ఈసారి జరిగే పార్లమెంట్ సమావేశాలు గతంలోలాగానే జరుగుతాయా ? లేదా అనేది చూడాలి. 
Read More :