Pet Cat : పిల్లి కోసం ప్రాణాలు పోగొట్టుకున్న మహిళ..
పిల్లి కోసం ఓ మహిళ ప్రాణాలు పోగొట్టుకుంది. పెంపుడు పిల్లిని రక్షించేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టింది.

Kolkata
kolkata woman pet Cat : పిల్లి కోసం ఓ మహిళ ప్రాణాలు పోగొట్టుకుంది. పెంపుడు పిల్లిని రక్షించేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టింది. పిల్లిని కాపాడే క్రమంలో పట్టుతప్పి అపార్ట్ మెంట్ ఎనిమిదో అంతస్థు నుంచి జారి పడి ప్రాణాలు కోల్పోయింది. కోల్ కతాలో జరిగిన ఈ ఘటన విషాదాన్ని కలిగించింది.
కోల్ కతాలోని టోలిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 70 లేక్ వ్యూ అపార్ట్ మెంట్ లో అంజనా దాస్ అనే 36 ఏళ్ల మహిళ తన తల్లితో కలిసి నివసిస్తోంది. అంజనా దాస్ కు సిటీలోనే శరత్ బోస్ రోడ్డులో ఓ ఇల్లు ఉంది. ఆఇంటికి రిపేర్లు చేయాల్సి రావటంతో తొమ్మిది అంతస్తులు కలిగిన లేక్ వ్యూ అపార్ట్ మెంట్ లో నెల రోజుల క్రితం అద్దెకు దిగారు. తనతో పాటు తన పెంపుడు పిల్లులు మూడింటినీ కూడా అపార్ట్ మెంట్ కు తెచ్చుకుంది.
గుజరాత్‌లో పిడుగుపాటుకు 27 మంది, 71 పశువులు మృతి
ఈక్రమంలో మూడింటిలో రెండు పిల్లులు ఆదివారం నుంచి కనిపించకుండాపోయాయి. దీంతో అంజనా ఆందోళపడి వాటికి కోసం వెతకటం ప్రారంభించింది.కానీ ఎక్కడా కనిపించలేదు. రోజంతా వెదికినా కనిపించలేదు. దీంతో ఆమె బెంగపడిపోయింది. ఈక్రమంలో సోమవారం ఉదయం మార్నింగ్ వాక్ కోసం టెర్రస్ పైకి వెళ్లిన ఆమెకు టెర్రస్ కింద బాల్కనీ లాంటి ప్రాంతంలో చిక్కుకున్న పిల్లి కనిపించింది. అంతే ఆమె మనస్సు ఒక్కసారిగా ఆనందపడిపోయింది. తన బుజ్జి పిల్లి కనిపించేసరికి దాన్ని ఎలాగైనా కాపాడాలనుకుంది.
ఏమాత్రం ఆలోచించకుండా దానిని కాపాడేందుకు టెర్రస్ పై నుంచి కిందకు దిగింది. అది చూసిన అపార్ట్ మెంట్ లో ఓ పెద్దాయని వారించారు. అయినా ఆమె వినలేదు. అలా పిల్లిని రక్షించే క్రమంలో కాలు స్లిప్ అయ్యింది. అంతే పట్టు తప్పింది. ఎనిమిదో అంతస్థు నుంచి కిందకు పడిపోయింది. తీవ్రంగా గాయపడి రక్తస్రావం అయ్యింది. పార్ట్ మెంట్ వాసులు వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అంజనా అప్పటికే చనిపోయిందని డాక్టర్లు తెలిపారు.
మూడు ఏనుగుల్ని చంపిన రైలు సీజ్
ఆమె టెర్రస్ పై నుంచి కిందికి దిగుతుండగా అంజనాను చూశానని..వద్దు ప్రమాదం అని వారించినా ఆమె వినలేదని తెలిపారు అపార్ట్ మెంట్ లోని ఓ వృద్ధుడు. కుమార్తె చనిపోవటంతో ఆమె తల్లి దు:ఖానికి అంతులేకుండాపోయింది.