ఓరి వీడి దుంపతెగ.. బాత్రూంలో భార్య వీడియోలనుతీసి బ్లాక్ మెయిల్.. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే.. భర్త చేసినపనికి భార్య ఏం చేసిందంటే..

ఈ ఘటన పూణెలోని అంబేగావ్ లో చోటు చేసుకుంది. 2020లో వీరిద్దరికి వివాహం జరిగింది. ఇద్దరూ ప్రభుత్వ ఉన్నతాధికారులు.

ఓరి వీడి దుంపతెగ.. బాత్రూంలో భార్య వీడియోలనుతీసి బ్లాక్ మెయిల్.. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే.. భర్త చేసినపనికి భార్య ఏం చేసిందంటే..

husband Films his wife Bathing

Updated On : July 23, 2025 / 8:43 AM IST

Pune: పుణెలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉన్నతాధికారులు. అయితే, వీరి మధ్య లావాదేవీల విషయంలో తరచూ గొడవలు జరుగుతుండేవి. డబ్బులు అడిగినప్పటికీ భార్య ఇవ్వకపోవటంతో భర్తకు కోపం కట్టలు తెంచుకుంది. దీంతో సొంత భార్యపట్లే దుర్మార్గంగా వ్యవహరించాడు. ఏకంగా బాత్రూంలో రహస్య కెమెరాలు పెట్టి భార్య నగ్న చిత్రాలు, వీడియోలు తీశాడు. అవి భార్యకు చూపించి బ్లాక్ మెయిల్ చేశాడు. ఈ ఘటన పుణెలో సంచలనంగా మారింది.

Also Read: పెళ్లై 20ఏళ్లు.. నలుగురు పిల్లలు.. 40ఏళ్ల వయస్సులో ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భర్త చేసిన పనికి అంతా షాక్.. భయంతో..

ఈ ఘటన పూణెలోని అంబేగావ్ లో చోటు చేసుకుంది. 2020లో వీరిద్దరికి వివాహం జరిగింది. ఇద్దరూ ప్రభుత్వ ఉన్నతాధికారులు. కారు, ఇంటి ఈఎంఐలు కట్టేందుకు డబ్బులు ఇవ్వాలని భార్యను అడిగాడు. ఆమె తల్లిదండ్రుల ఇంటి నుండి రూ.లక్షన్నర ఇప్పించాలని భార్యపై ఒత్తిడి తెచ్చాడు. భర్త తరపు కుటుంబ సభ్యులు కూడా పుట్టింటి నుంచి కొంత డబ్బులు తేవాలని ఒత్తిడి చేశారు. దీంతో ఆమె అందుకు ఒప్పుకోలేదు. భార్య వద్ద నుంచి కారు, ఇంటి ఈఎంఐలకోసం ఎలాగైనా డబ్బులు వసూలు చేయాలని భావించిన భర్త.. దుర్మార్గమైన పనికి ఒడిగట్టాడు.

ఇంట్లోని బాత్రూంలో రహస్య కెమెరాను ఏర్పాటు చేశాడు. భార్య స్నానం చేస్తున్న సమయంలో చిత్రాలు, వీడియోలను తీశాడు. ఆ వీడియోలను భార్యకు చూపించి కారు, ఇంటి ఈఎంఐల కోసం తనకు డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు.

భర్త చేసిన పనికి కంగుతిన్న ఆమె.. వెంటనే తేరుకొని అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భర్త, ఆయన కుటుంబీకుల నుంచి తనకు వేధింపులు ఎదురవుతున్నాయని ఫిర్యాదు చేసింది. డబ్బులు కావాలని కొంతకాలంగా తన భర్త, ఆయన కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది.

పోలీసులు భర్తను స్టేషన్‌కు పిలిపించి ఆయన నుంచి వివరాలు సేకరించారు. భార్య ఫిర్యాదు మేరకు భర్త, అతని కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.