షిర్డీ ఆలయానికి రావద్దు..వస్తే చర్యలు తప్పవు : తృప్తీ దేశాయ్ కు నోటీసులు

women Activist trupti desai shirdi temple Entry band : షిరిడీ దేవాలయానికి వచ్చే భక్తులు..ముఖ్యంగా మహిళలు సంప్రదాయ దుస్తులనే ధరించి రావాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. దీనికి సంబంధించి దేవాలయం వద్ద పోస్టర్లను కూడా ఏర్పాటు చేసింది కమిటీ.
దీన్ని మహిళల అసమానతలపై పోరాడే ప్రముఖ సామాజిక కార్యకర్త తృప్తీ దేశాయ్ వ్యతిరేకించారు. డిసెంబర్ 10న తోటి మహిళా కార్యకర్తలతో సాయిబాబా ఆలయానికి వచ్చి ఆ పోస్టర్లు తొలగిస్తానని ప్రకటించారు.
దీంతో షిర్డీ దేవాలయం సబ్ డివిజనల్ ఆఫీస్ తృప్తీ దేశాలయ్ కు నోటీసులు పంపించింది. ఆమె ప్రకటించిని తేదీ దాటి 11వ తేదీ వరకూ ఆమెకు షిర్డీ దేవాలయానికి రావద్దని నోటీసుల్లో పేర్కొన్నారు. కాదనీ వస్తే ఆమెను ఆలయంలోకి ప్రవేశించనివ్వమని తేల్చి చెప్పింది.
ఆమె దేవాలయ ప్రవేశాన్ని నిషేధిస్తామని అధికారులు నోటీసులు జారీ చేశారు. తమ ఆదేశాలను మీరి ఆమె ఆలయంలోకి ప్రవేశించాలని చూస్తే ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కాగా..ఇటీవల ఆలయంలోకి వచ్చే భక్తులు సంప్రదాయ వస్త్రాలను మాత్రమే ధరించాలని నిర్ణయించిన ఆలయ కమిటీ ప్రకటించింది. దీనికి సంబంధించి పోస్టర్లను ఆలయం గోడలపై ప్రదర్శించింది. ఈ బంధనలను తప్పుబట్టిన తృప్తిదేశాయ్ ..తన తోటి సామాజిక కార్యకర్తలతో కలిసి తాను 10వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు స్వామి దర్శనానికి వస్తానని ముందే ప్రకటించారు.
తానే స్వయంగా తానే పోస్టర్లను తొలగిస్తానని ప్రకటించారు. దీంతో ముందు జాగ్రత్తగా ఆలయ కమిటీ శాంతి భద్రతల సమస్యలు తలెత్తవచ్చన్న ఆలోచనతో..ముందు జాగ్రత్తగా ఈ మేరకు నోటీసులు జారీ చేశామని అధికారులు తెలిపారు.