ఆపరేషన్లు చేయించుకున్న మహిళల దుస్థితి: చేతులతో మోసుకొచ్చి నేలమీద పడుకోబెడుతున్నారు

  • Published By: veegamteam ,Published On : December 1, 2019 / 04:03 AM IST
ఆపరేషన్లు చేయించుకున్న మహిళల దుస్థితి: చేతులతో మోసుకొచ్చి నేలమీద పడుకోబెడుతున్నారు

Updated On : December 1, 2019 / 4:03 AM IST

మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్ జిల్లా ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న దుస్థితి చూస్తుంటే మనస్సు ద్రవించుపోతోంది. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్న మహిళల్ని ఆపరేషన్ థియేటర్ నుంచి తీసుకొచ్చి కటిక నేలమీదనే పడుకోబెడుతున్న దుర్భరస్థితి. ఆపరేషన్ చేయించుకున్న మహిళల్ని థియేటర్ నుంచి తీసుకురావటానికి కనీసం స్ట్రెచ్చర్ లు కూడా లేవు ఇద్దరు మనుషులు చేతులపై ఎత్తుకుని తీసుకువచ్చి నేలమీదనే పడుకోబెడుతున్నారు. 

దీనిపై నిరసలు వెల్లువెత్తాయి. దీంతో దీనికి కారణమైనవారిపై చర్యలు తీసుకుంటామని చెప్పి ఉన్నతాధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ఈ విషయంపై  సివిల్ సర్జన్ డాక్టర్ ఆర్ త్రిపాఠిని ప్రశ్నించగా.. రోజూ 30 మంది వరకు కుటుంబనియంత్రణ ఆపరేషన్లు జరుగుతాయని చెప్పారు. అయితే వారికి సరిపడా బెడ్స్  ఆసుపత్రిలో లేవని, మౌలిక సదుపాయాలు ఇంకా మెరుగుపరచాల్సి ఉందని చెబుతున్నారు. అందుకే తప్ప మేము చేసేందేమీ లేదని..బెడ్స్ ఉంటే తాము ఆపరేషన్ చేయించుకున్న మహిళల్ని నేలపై ఎందుకు పడుకోబెడతామని సమాధానమిస్తున్నారు.  

నేను రాను బిడ్డో సర్కారు దవాఖాను అనే పాట కచ్చితంగా గుర్తుకొస్తుంది ఈ మహిళలకు చూస్తుంటే. మౌలిక సదుపాయాల కొరత, మందుల కొరత, డాక్టర్ల కొరత.. కొరత లేనిది ఏమీ ఉండదు. అన్నీ కొరతే.  ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస వసతులు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో కళ్లకు కట్టే ఘటన ఇది. కాగా..ప్రతీ సంవత్సరం ఇదే పరిస్థితి కొనసాగుతున్నా..ఉన్నతాధికారులు గానీ..ఆరోగ్య శాఖ గానీ ఎటువంటి సౌకర్యాలు కల్పించకపోవటం గమనించాల్సిన విషయం.