Indira Gandhi Airport : ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్ స్వాధీనం

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.14.14 కోట్ల విలువైన హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు.

Indira Gandhi Airport : ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్ స్వాధీనం

Indira Gandhi Airport

Updated On : December 22, 2021 / 10:41 AM IST

Indira Gandhi Airport : ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.14.14 కోట్ల విలువైన హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఉగాండా దేశానికి చెందిన మహిళ దుబాయి మీదుగా ఢిల్లీ వచ్చింది. ఆమె లగేజీలో వైట్ కలర్‌లో ఉన్న పౌడర్ కనిపించడంతో అనుమానం వచ్చిన అధికారులు ఆమెను అడ్డుకొని తనిఖీ చేశారు. అది హెరాయిన్‌గా గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 2020 గ్రాములు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మహిళను నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్పోక్‌ సబ్‌స్టాన్సెస్‌ యాక్ట్‌ 1985 కింద అరెస్టు చేశారు.

చదవండి : Heroin Seized : గుజరాత్​లో రూ.400 కోట్ల విలువైన 77 కిలోల హెరాయిన్ స్వాధీనం

ఇక ఈ ఏడాది దేశ వ్యాప్తంగా 15 వేల కోట్లకు పైగా విలువైన మాదకద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేవలం ఢిల్లీ విమానాశ్రయంలోనే 100కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. దీని విలువ సుమారు రూ.700 కోట్లు ఉంటుందని అంచనా. ఇక మాదకద్రవ్యాలను తరలిస్తున్న 26 మందిని ఈ ఏడాది ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా నేపథ్యంలో కస్టమ్స్‌ అధికారులు చర్యలు చేపడుతున్నారు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని తనిఖీలు చేస్తూ.. మాదక ద్రవ్యాల రవాణా జరుగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

చదవండి : Star Heroins Business: బ్రాండ్ వాల్యూ క్యాష్ చేసుకుంటున్న స్టార్ బ్యూటీస్!