’మాస్క్ లగానా హై‘పెట్టుకోకుంటే..500ల సార్లు ఇంపోజిషన్ రాయాల్సిందే

  • Published By: nagamani ,Published On : July 16, 2020 / 01:28 PM IST
’మాస్క్ లగానా హై‘పెట్టుకోకుంటే..500ల సార్లు ఇంపోజిషన్ రాయాల్సిందే

Updated On : July 20, 2020 / 3:45 PM IST

‘mask lagaana hai ‘500 times as imposition మాస్క్ పెట్టుకుండా బైటకువచ్చేవారికి ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ పోలీసులు విచిత్రమైన శిక్షలు వేస్తున్నారు.మాస్క్ లగానా హై (ముసుగు ధరించాలి)’ అంటూ వేసే శిక్షలు వినటానికి ఫన్నీగానే ఉన్న దాంట్లో అంతరార్ధం మాత్రం మాస్క్ లు పెట్టుకోవాలనే అని అంటున్నారు పోలీసులు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ జిల్లా పోలీసు యంత్రాంగం మాస్కు పెట్టుకోనివారికి విచిత్రమైన శిక్ష విధిస్తోంది. మాస్కులు పెట్టుకోకుండా వచ్చిన వారిని ఠక్కున పక్కకు లాగేస్తున్నారు. ‘‘మాస్కు తప్పనిసరిగా పెట్టుకోవాలి’’ అనే వాక్యాన్ని 500 సార్లు ఇంపోజిషన్ రాయిస్తున్నారు.

ఈ శిక్షకు మాస్కు పాఠం అనే ఉపయుక్తమైన పేరును కూడా పెట్టారు అధికారులు.దాని పేరు ‘మాస్క్ కి క్లాస్’ వీధుల్లో మాస్కులు లేకుండా తిరుగుతున్న వారిని ఓ క్లాస్ రూమ్ లో కూర్చోపెట్టి ఈ శిక్షను అమలు చేస్తున్నారు. అలాగే కొంతమందితో నడిరోడ్డుమీద గుంజిళ్లు తీయిస్తున్నారు. ఇంకొంతమందిని రోడ్డు మీదనే గంటల తరబడి నిలబెడుతున్నారు.

ఈ విచిత్రమైన శిక్షల గురించి పోలీసు సూపరింటెండెంట్ సచింద్ర పటేల్ మాట్లాడుతూ..కరోనా నిబంధల్ని పాటించనివారికి ఫైన్లు వేసినా పట్టించుకోవట్లేదు. డబ్బులు ఇచ్చేసి దర్జాగా తిరిగేస్తున్నారు. దీంతో ఇలాకాదని..చిన్నప్పుడు పిల్లలకు వేసే శిక్షలు వేయాలనుకున్నామని..మాస్కులు లేకుండా వచ్చేవారిని పట్టుకుని క్లాస్ రూమ్ లో 3 నుంచి 4 గంటలు కూర్చోబెట్టి ‘‘మాస్కులు తప్పని సరిగా పెట్టుకోవాలి’’అని 500ల సార్లు ఇంపోజిషన్ రాయిస్తున్నామని ‘మాస్క్ లగానా హై (ముసుగు ధరించాలి)’ 500 సార్లు వ్రాయాల్సిందేనని పటేల్ తెలిపారు.