Rahul Gandhi: లంకను తగలబెట్టింది హనుమ కాదు.. రావణుడిని చంపింది రాముడు కాదు: రాహుల్
రావణుడు ఇద్దరి మాటలను మాత్రమే వినేవాడని రాహుల్ గాంధీ అన్నారు. వారిద్దరే...

Rahul Gandhi
Rahul Gandhi – Lok Sabha: లంకను తగలబెట్టింది స్వామి హనుమ కాదని.. అలాగే, రాక్షసుడు రావణుడిని చంపింది శ్రీ రాముడు కాదని కాంగ్రెస్ (Congress) అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. రావణుడు తన అహంకారం, ద్వేషం వల్లే సర్వనాశనమయ్యాడని, లంక తగలబడడానికి కారణమూ ఇదేనని చెప్పారు.
ఇవాళ అవిశ్వాస తీర్మానంపై రాహుల్ గాంధీ మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితులపై లోక్‌సభలో మాట్లాడుతూ… రావణుడు ఇద్దరి మాటలను మాత్రమే వినేవాడని, వారిద్దరే మేఘనాథుడు, కుంభకర్ణుడని అన్నారు. అచ్చం అలాగే, మోదీ కూడా ఇద్దరి మాటలు మాత్రమే వింటున్నారని, వారిద్దరు అమిత్ షా, అదానీ అని చెప్పారు.
దేశం మొత్తాన్ని తగలబెతున్నారని, మొత్తం మణిపూర్ తగలబడిందని, ఇప్పుడు హరియాణలోనూ అదే జరుగుతోందని రాహుల్ గాంధీ చెప్పారు. దేశ మొత్తాన్ని తగలబెట్టాలనే భావిస్తున్నారని విమర్శించారు. మణిపూర్ లో భారత ఆర్మీ ఒక్క రోజులో శాంతిని పునరుద్ధరించగలదని, కానీ, ఆ పనిని చేయనివ్వట్లేరని ఆరోపించారు. మణిపూర్ లో భరతమాతను హత్య చేశారని అన్నారు.
YS Sharmila: 27 మంది విద్యార్థుల ఆత్మహత్యలు.. బంది పోట్ల రాష్ట్ర సమితిలో చలనం లేదు: షర్మిల