Viral Video : QR కోడ్‌తో క్రియేటివ్‌గా కూరగాయలు అమ్ముతున్న మహిళా వ్యాపారి

ఇప్పుడు అంతా డిజిటిల్ చెల్లింపులకు అలవాటు పడుతున్నారు. వీధి వ్యాపారులు సైతం డిజిటల్ చెల్లింపులను అంగీకరిస్తుండటంతో కరెన్సీ నోట్లకు పని తప్పుతోంది. ఓ కూరగాయలు అమ్మే మహిళ డిజిటల్ చెల్లింపుల కోసం తన క్రియేటివిటీని ఎలా ఉపయోగించిందో చూడండి.

Viral Video : QR కోడ్‌తో క్రియేటివ్‌గా కూరగాయలు అమ్ముతున్న మహిళా వ్యాపారి

Viral Video

Updated On : September 1, 2023 / 6:02 PM IST

Viral Video : ఒకప్పుడు చేతిలో డబ్బులు లేకపోతే బయటకు వెళ్లడం కష్టంగా ఉండేది. ఇప్పుడు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు డిజిటల్ చెల్లింపులతో సమస్తం షాపింగ్ చేసేయచ్చు. వీధి వ్యాపారులు సైతం డిజిటల్ చెల్లింపులను అంగీకరిస్తున్నారు. తాజాగా ఓ మహిళా కూరగాయల వ్యాపారి డిజిటల్ చెల్లింపులను ఎలా యాక్సెప్ట్ చేస్తోందో చూస్తే ఆశ్చర్యపోతారు.

Mumbai : కుక్కల మెడలో QR కోడ్ .. తప్పిపోయిన డాగ్స్ ట్రాక్ చేయడానికి క్రియేట్ చేసిన ఇంజనీర్

ఇప్పుడంతా డిజిటల్ యుగం. బడా వ్యాపారుల నుంచి రోడ్డు సైడ్ పూలు, పండ్ల వ్యాపారులు సైతం డిజిటల్ చెల్లింపులను అంగీకరిస్తున్నారు. ఇటీవల ఓ కూరగాయలు అమ్మే మహిళ డిజిటల్ చెల్లింపుకోసం ఎంచుకున్న విధానం అందరికీ నవ్వు తెప్పించింది. డబ్బులు చెల్లించడానికి QR కోడ్ ను స్కాన్ చేయాలి.. కదా.. ఆ కోడ్‌ను క్రియేటివ్ గా ఆలోచించి బరువు కొలిచే పాత్ర వెనుక అతికించింది. ఓ కస్టమర్ బిల్లు చెల్లించేందుకు QR కోడ్ అడగ్గానే ఆమె  ఆ కోడ్‌ను చూపించడంతో అందరూ విస్మయానికి గురయ్యారు.

coconut seller : QR కోడ్‌తో అమ్మకాలు చేస్తున్న కొబ్బరి వ్యాపారి .. అభినందిస్తున్న నెటిజన్లు

maharashtra.farmer అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో ఓ వ్యక్తి మహిళ నుంచి వేరుశెనగలు కొంటున్నట్లు కనిపిస్తుంది. ఆమెను నగదు చెల్లింపు కోసం QR కోడ్ అడగ్గానే ఎవరూ ఊహించని విధంగా తూకం కొలిచే పాత్ర వెనుక కోడ్‌ను చూపించింది. ఆమె క్రియేటివిటీ చూసి అందరూ ప్రశంసలు కురిపించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Maharashtra Farmer (@maharashtra.farmer)