Police Mask Checking : మాస్క్ పెట్టుకోలేదా అన్నందుకు ఇన్స్ పెక్టర్ చెంప చెళ్లుమనిపించాడు

.ఖుషీ నగర్ లో ఓ యువకుడు మాస్క్ లేకుండా దర్జాగా తిరుగుతున్నాడు. దీనిని పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు కనిపించింది. వాహనంలో వెళుతూ..అతన్ని ఆపారు.

Police Mask Checking : మాస్క్ పెట్టుకోలేదా అన్నందుకు ఇన్స్ పెక్టర్ చెంప చెళ్లుమనిపించాడు

Young man Slapped

Updated On : April 24, 2021 / 3:45 PM IST

Young Man Slapped Sub Inspector : కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా సాగుతోంది. లక్షలాదిగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చే సమయంలో మాస్క్ లు ధరించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తుకుంటున్నా..కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు జరిమానాలు విధిస్తున్నాయి. అయితే..మాస్క్ ఎందుకు ధరించలేదని ప్రశ్నించినందుకు కొంతమంది దాడులకు దిగుతున్నారు. మాస్క్ పెట్టుకోలేదని అడిగినందుకు ఓ కానిస్టేబుల్ ను చెంప చెళ్లుమనిపించాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో గణనీయంగా కేసులు పెరుగుతున్నాయి. మాస్క్ పెట్టుకోకుండా బయటకు వచ్చిన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. పోలీసులు డ్రైవ్స్ నిర్వహిస్తూ..మాస్క్ పెట్టుకోలేని వారి తాట తీస్తున్నారు. ఈ క్రమంలో..ఖుషీ నగర్ లో ఓ యువకుడు మాస్క్ లేకుండా దర్జాగా తిరుగుతున్నాడు. దీనిని పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు కనిపించింది. వాహనంలో వెళుతూ..అతన్ని ఆపారు. మాస్క్ ఎందుకు పెట్టుకోలేదు ? ఎందుకంత నిర్లక్ష్యం..అంటూ వాహనంలో ఉన్న ఇన్స్ పెక్టర్ యువకుడిని ప్రశ్నించాడు. అతనిలో ఏ మాత్రం భయం లేకపోవడంతో కాలర్ పట్టుకున్నారు.

మాస్క్ పెట్టుకుంటాను సర్ అంటూ సమాధానమిస్తూ…సడెన్ గా ఇన్స్ పెక్టర్ చెంప చెళ్లుమనిపించి పరుగులు తీశాడు. ఈ ఘటనతో అక్కడున్న పోలీసులు బిత్తరపోయారు. వెంటనే ఆ యువకుడిని పట్టుకోవడానికి ఓ పోలీసు ప్రయత్నించారు. కొంతమంది ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

Read More : Kamareddy : గురువారం పుట్టిన రోజు..ప్రతిభాశాలి..కరోనాతో మృతి