Maharashtra : యజమాని మంగళసూత్రం మింగేసిన గేదె .. తరువాత ఏం చేశారంటే..

ఓ గేదె తన యాజమానురాలి మంగళసూత్రాన్ని మింగేసింది. దీంతో వారు ఏం చేశారంటే..

Maharashtra : యజమాని మంగళసూత్రం మింగేసిన గేదె .. తరువాత ఏం చేశారంటే..

buffalo swallows mangalsutra

Updated On : October 3, 2023 / 4:30 PM IST

buffalo swallows mangalsutra : మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో సారసి అనే గ్రామంలో ఓ గేదె తన యాజమానురాలి మంగళసూత్రాన్ని మింగేసింది. ఆ మంగళసూత్రం విలువ దాదాపు రూ.2 లక్షలు. యజమాని మంగళసూత్ర గేదె నోటికి ఎలా చిక్కింది.? అనే డౌట్ వచ్చిందా..? నిజమే మరి మెడలో ఉండే మంగళసూత్రాన్ని గేదె ఎలా మింగుతుంది..? అనే డౌట్ వచ్చే తీరుతుంది.ఇంతకీ ఏం జరిగిందంటే..

సారసి గ్రామానికి చెందిన రాంహరి అనే రైతు భార్య తన మంగళసూత్రాన్ని తీసి సోయాబీన్, వేరుశెనగలు ఉన్న పళ్లెంలో పెట్టి స్నానానికి వెళ్లింది. స్నానం చేసి తిరిగి వచ్చాక ఇంటి పనుల్లో పడి ఆమె మంగళసూత్రం సంగతి మర్చిపోయింది. తాను మంగళసూత్రం పళ్లెంలో పెట్టాననే సంగతి మర్చిపోయి ఆ ప్లేటును పశువుల కొట్టంలో ఉన్న గేదెకు పెట్టింది.

Kerala : మారుతి 800 కారుని రోల్స్ రాయిస్‌గా మార్చేసిన యువకుడు..!

ఆ తరువాత దాదాపు రెండు గంటలకు మెడలో మంగళసూత్రం లేదని గాబరాపడింది. ఇల్లంతా వెదుక్కుంది. అప్పటికి మంగళసూత్రాన్ని సోయాబీన్ పళ్లెంలో పెట్టానని దాన్ని గేదెకు పెట్టానని గుర్తుకొచ్చింది. అంతే వెంటనే బాణంలా పశువుల కొట్టంలోకి దౌడు తీసింది. తాను గేదె ముందు పెట్టిన పళ్లాన్ని పరిశీలించింది. కానీ ప్లేట్ మొత్తం ఖాళీగా ఉంది. దీంతో కంగారుపడిపోయింది. తన మంగళసూత్రం సోయాబీన్ తొక్కలతో పాటు గేదె తినేసిందని గ్రహించింది.

వెంటనే భర్త రాంహరితో ఈ విషయాన్ని చెప్పింది. అతను పశువుల డాక్టర్ కు ఫోన్ చేసి చెప్పాడు. గేదెను పశువుల ఆస్పత్రికి తీసుకురమ్మని సూచించాడు. డాక్టర్ సూచనలతో రాంహరి గేదెను ఆస్పత్రికి తోలుకెళ్లాడు. ఆ గేదె కడుపులో మంగళసూత్రం ఉన్నట్టు మెటల్ డిటెక్టర్ సహాయంతో డాక్టర్ బాలా సాహెబ్ గుర్తించాడు. వెంటనే ఆ గేదెకు సర్జరీ చేసి మంగళసూత్రాన్ని బయటకు తీశారు. ఆ తర్వాత ఆ గేదెకు కుట్లు వేశారు. ప్రస్తుతం గేదె సర్జరీ నుంచి కోలుకుంటోంది.