Divorce Temple : విడాకుల గుడి .. 600 ఏళ్ల చరిత్ర

విడాకుల కోసం ఓ గుడి ఉందని మీకు తెలుసా? మీరు విడాకులు కావాలా? ఇదిగో విడాకులు ఇచ్చే గుడి ఉంది. అక్కడికెళితే విడాకులు గ్యారంటీ..

Divorce Temple : విడాకుల గుడి .. 600 ఏళ్ల చరిత్ర

Tokeiji Divorce Temple

Updated On : June 19, 2023 / 6:04 PM IST

Divorce Temple : ప్రపంచంలో ఎన్నో ఆలయాలున్నాయి. వాటికి ప్రత్యేకతలు ఉంటాయి. రాహు-కేతు దోష పరిహారమవ్వాలంటే శ్రీకాళహస్తీశ్వర స్వామివారి గుడి (sri kalahasti temple). విదేశాలకు వెళ్లాలంటే వీసా రావాలంటే.. చిలుకూరు బాలాజీ గుడి (Chilukur Balaji Temple). ఈ గుడికి వెళితే వీసా (Visa)వచ్చేస్తుందనే నమ్మకం ఉంది. దీంతో ఆ ఆలయానికి.. వీసా టెంపుల్ అనే పేరు కూడా పడిపోయంది. ఇలా ఎన్నో దేవాలయాలకు ఎన్నో పత్యేకతలు ఉంటుంటాయి. కానీ.. ఈ భూమిపై విడాకుల గుడి ఉందని విషయం మీకు తెలుసా..?అసలు.. విడాకుల గుడి అనే పేరు ఎలా వచ్చింది?

విడాకుల కోరికలు నెరవేర్చేందుకు కూడా ఓ గుడి (Divorce Temple)ఉందని చాలా మందికి బహుశా తెలిసి ఉండదు. అసలు అటువంటి ఓ గుడి ఉంటుందని ఊహించను కూడా ఊహించం.కానీ.. అలాంటి ఆలయం ఉంది. కాకపోతే.. మన భారత్ లో కాదు గానీ జపాన్‌లో ఉంది.ఈ ఆలయానికి.. డివోర్స్ టెంపుల్ (Divorce Temple)అనే పేరు ఎందుకొచ్చిందో తెలిస్తే.. నిజంగా షాక్ అవుతాం…

Viral Video: గ్రాడ్యుయేషన్ పాసైన ఆనందతో డాన్స్ చేసింది.. అదే ఆమె కొంప ముంచింది

600 ఏళ్లకుపైగా చరిత్ర ( 600-year-old Buddhist temple)కలిగిన ఈ టోకీజీ ఆలయం ( Tokeiji Temple).. జపాన్‌ (Japan)లో ఎంతో పాపులర్ టెంపుల్. ఈ ఆలయానికి ఘనమైన సంస్కృతి, ఆచార సంప్రదాయాలు ఉన్నాయి. ఈ దేవాలయం మహిళా సాధికారతని, నవీనీకరణ సందేశాన్ని అందిస్తుంది. అందువల్ల.. ఆ టెంపుల్‌ని.. డివోర్స్ టెంపుల్‌గా పిలుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా.. ఈ విడాకు దేవాలయం ఎంతో పాపులర్. ఈ ఆలయానికి ఈ పేరెలా వచ్చిందంటే.. 1285లో బౌద్ధ బిక్షువు (Buddhist nun)కాకుసాన్‌ షిదో-నీ ( Kakusan Shid-ni)నిర్మించిన ఈ ఆలయం ప్రముఖ బౌద్ధ మందిరంగా విలసిల్లుతోంది. మొదట్లో ఈ ఆలయంలో నిస్సహాయులైన మహిళలకు ఆధ్యాత్మిక శిక్షణ అందించేవారు. ఆ రోజుల్లో మహిళల పరిస్థితి ఘోరంగా ఉండేది. వారికి సమాజంలో ఎటువంటి అధికారాలు ఉండేవి కాదు. దీనికితోడు వారిపై సామాజిక కట్టుబాట్లు విధించేవారు. అటువంటి పరిస్థితుల మధ్య మహిళలు గృహ హింసకు గురయ్యేవారు. దాంతో.. వాళ్లంతా ప్రశాంతత కోసం ఈ మందిరానికే వస్తుండేవారు.

ఆ రోజుల్లో.. జపాన్‌లోని కొన్ని సామాజిక వర్గాల్లో జరిగే పెళ్లిళ్లు.. పెటాకులవుతుండేవి. విడాకుల వ్యవహారాలు కూడా ఎక్కువ సంఖ్యలోనే జరిగేవి. ఇటువంటి సమయంలో.. ఒంటరి మహిళలంతా ఇక్కడికి వచ్చి ఆశ్రయం పొందుతుండేవారు. అలాంటి మహిళలకు.. ఈ ఆలయంలోనే.. విడాకుల ధ్రువపత్రాలు (Divorce certificates)అందించేవారు. అవి ఒంటరి మహిళలకు.. స్వేచ్ఛగా ఉండే హక్కును ఇచ్చేవి. ఈ టోకీజీ మందిరం( Tokeiji Temple)లో ఓ సంగ్రహాలయం కూడా ఉంది. దీనిలో.. ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర కలిగిన కళాకృతులు కొలువుదీరి ఉంటాయి. నాటి మహిళల కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపే ఆనవాళ్లు ఇక్కడ కనిపిస్తాయ్.

Washington Recruits Dogs And Cats: ఎలుకలను పట్టుకునేందుకు కుక్కలు, పిల్లుల నియామకం

పేరుకు ఇది విడాకుల ఆలయంగా ప్రసిద్ధి చెందినా.. ఇదొక బౌద్ధ మందిరం (Buddhist temple)గా పేరొందింది. బౌద్ధ మతానికి సంబంధించిన ధార్మిక సమావేశాలు ఇ‍క్కడ జరుగుతుండేవి. ఇప్పటికీ.. ఆలయంలోని బౌద్ధ బిక్షువులు, నన్‌లు ఇక్కడికి వచ్చేవారికి మార్గదర్శనం చేస్తుంటారు. పచ్చని ప్రకృతి సోయగాల మధ్య ఉన్న ఈ ఆలయం ఎంతో ప్రశాంతతని ప్రసాదిస్తుంది. కలపతో రూపొందించిన అనేక కళాకృతులు ఈ ఆలయంలో కనిపిస్తాయి. ఆలయ ద్వారం వైపు ముందుకు సాగేవారికి.. రాతితో కూడిన రహదారి మార్గం స్వాగతం పలుకుతుంది. ఆలయంలోని పెద్ద హాలులో ధార్మిక సమావేశాలు, ధ్యాన కార్యక్రమాలు జరుగుతుంటాయి.