Heart Shape Dosa : ‘హార్ట్ షేప్’ దోశ .. ‘గుండె’ను కొల్లగొడుతోందిగా..

‘గుండె’ ఆకారంలో ఉండే దోశతో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. స్టార్ హోటల్ కు నా దోశ ఏమాత్రం తగ్గేదేలేదన్నట్లుగా వేసిన దోశ వారెవ్వా అనిపిస్తోంది.

Heart Shape Dosa : ‘హార్ట్ షేప్’ దోశ .. ‘గుండె’ను కొల్లగొడుతోందిగా..

heart shape dosa

Updated On : May 10, 2023 / 3:48 PM IST

Heart Shape Dosa : ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్ లో అని అంటారు గానీ స్ట్రీట్ ఫుడ్ రుచే వేరే.. అన్నట్లుగా ఉంటాయి. రుచిలోగానీ ధరల్లో గానీ. స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు ఆడుతు పాడుతు చేసే ఆహారాలకు మంచి డిమాండ్ఉంటుంది. ల్యాండ్ మార్కుగా పేరొందే వ్యాపారులు ఎంతోమంది. వారి వారి స్టైల్ తో చేసే వంటకాలతో కష్టమర్లను ఆకట్టుకోవటంలో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారుల తరువాతే ఎవరైనా అన్నట్లుగా ఉంటారు. చక చక్కా మెరుపువేగంతో చేతులు తిప్పుతు చేసే వంటకాలు రుచిలోను..లుక్ లోనే వారెవ్వా అనిపిస్తాయి. స్టార్ హోటల్స్ లో సర్వ్ చేసే ఆహారాలు వాటి రుచి కంటే వాటి డెకరేషన్ స్టైల్ ఓ రేంజ్ లో ఉంటుంది. మెస్మరైజ్ చేసే లుక్ లో డెకరేషన్ వారెవ్వా అనిపిస్తుంది.

కానీ వాటికి ఏమాత్రం తక్కువ కాదన్నట్లుగా స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు స్టైల్ ఆకట్టుకుంటోంది. పైగా స్టార్ హోటల్స్ కంటే రుచికి రుచి..ధరకు ధరలోనే స్ట్రీట్ ఫుడ్ వ్యాపారుల తీరే వేరుగా ఉంటుంది. నాగ్ పూర్ లో అటువంటి ఓ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి వేసిన దోశ చూస్తే వావ్..ఏమి స్టైల్..ఏ షేప్ అంటూ లొట్టలేయాల్సిందే. ఇన్ స్టా గ్రామ్ లో ఓ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి ‘గుండె’ఆకారంలో వేసిన దోశ చూస్తే ‘గుండె’జారి గల్లంతైయ్యిందే అనిపించకమానదు.

చకచకా పెన్నంపై దోశ వేసి సీజ్ తో పాటు ఉల్లి క్యారెట్ వేసి దోరగా దోశ కాల్చి ఆ దోశను ‘గుండె’ ఆకారంలో కట్ చేసిన స్టైల్ వావ్ అనిపిస్తోంది. ఓ పక్క ఫోన్ మాట్లాడుతునే చకచకా దోశ వేసిన విధానం వారెవ్వా ఏం స్పీడు భయ్యా అనిపిస్తుంది. పెన్నంపై దోశ వేసి దానిపై కలర్ ఫుల్ గా అన్ని వేసి ఆఖరిగా ‘హార్ట్ షేప్’లో దోశను కట్ చేసిన తీరు వాహ్..అనిపిస్తోంది. కలర్ ఫుల్ గా ‘హార్ట్ దోశ’ తింటూ ఉంటుంది భయ్యా….స్వర్గం నాలుకపై తాండవం ఆడినట్లే..మరి మీరు కూడా ఓ లుక్కేయండీ ఈ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి స్టైల్ లో వేసిన ‘హార్ట్ దోశ’ పై..