Health village Rajamma tanda : చావుకు సవాల్ విసిరే గ్రామం..సంప్రదాయ పద్ధతులతో జీవనం సాగిస్తున్న ఆరోగ్యాల పల్లె..30 ఏళ్లలో ఏడంటే ఏడే చావులు
చావుకు సవాల్ విసిరే గ్రామం గురించి చెప్పాలంటే ఎన్నో విశేషాలున్నాయి. ఆధునికకాలంలో కూడా సంప్రదాయ పద్ధతులతో జీవనం సాగిస్తున్న ఆరోగ్యాల పల్లె ఎన్నో పాఠాలు నేర్పోతోంది. 30 ఏళ్లలో ఏడంటే ఏడే చావులు ఆగ్రామంలో చోటుచేసుకున్నాయంటే వారి ఆరోగ్యం ఎంత చక్కగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అదే రాజమ్మ తండా ప్రత్యేకత.

Health village Rajamma tanda
Health village Rajamma tanda : చావుకు సవాల్ విసిరే గ్రామం గురించి చెప్పాలంటే ఎన్నో విశేషాలున్నాయి. ఆధునికకాలంలో కూడా సంప్రదాయ పద్ధతులతో జీవనం సాగిస్తున్న ఆరోగ్యాల పల్లె ఎన్నో పాఠాలు నేర్పోతోంది. 30 ఏళ్లలో ఏడంటే ఏడే చావులు ఆగ్రామంలో చోటుచేసుకున్నాయంటే వారి ఆరోగ్యం ఎంత చక్కగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అదే రాజమ్మ తండా ప్రత్యేకత. రాజమ్మ తండా వాసులు ఆరోగ్యం విషయంలో మనకు ఎన్నో విషయాలను నేర్పుతున్నారు. మినరల్ వాటర్ తాగడమే మంచి అని మనం అనుకుంటుంటే.. భూగర్భం నుంచి వచ్చే శుద్ధ జలాలనే అమృతంలా భావిస్తున్నారు తండా వాసులు.
ఇప్పటివరకు ఆ గ్రామస్థులు ఎవ్వరూ మినరల్ వాటర్‌ను టేస్ట్ కూడా చేయలేదు. అంతేకాదు తండాలో ఏ ఒక్కరి ఇంట్లో ఎలక్ర్టానిక్ వస్తువులు ఉండవు. టీవీ, ఫోన్ మినహా.. మిగిలిన వాటికి దూరం. ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్, ఎయిర్ కూలర్ వంటివి కొనే స్థోమత ఉన్నా.. అవి వాడాల్సిన అవసరం లేదంటున్నారు తెలంగాణలోని కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని రాజమ్మ తండా వాసులు.
తాము సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటానికి తమ ఆహార పద్ధతులే కారణమంటున్నారు తండాకు చెందిన వృద్ధులు. పిడకలు, కట్టెల పొయ్యిపైనే వంటలు చేస్తారు. తమ భోజనంలో మక్క రొట్టె మస్ట్‌గా ఉండేలా చూసుకుంటారు. ఏ ఇంట్లో కూడా రొట్టె లేకుండా ఒక్కపూట కూడా గడవదని చెబుతున్నారు తండా వాసులు. సంపూర్ణ ఆరోగ్యం, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అనుసంధానమే ప్రకృతి జీవనం. చెట్లు, పుట్టలు కొండలు, పక్షులతో సహజీవనం చేస్తూ హాయిగా గడపడం మనకు ప్రకృతి ఇచ్చిన వరం. పాశ్చాత్య నాగరికతకు అలవాటుపడి మానసిక, శారీరక ఆరోగ్యానికి దూరమై కాలుష్య ప్రపంచంలో భారంగా జీవితాన్ని సాగిస్తున్న చాలా మందికి… రాజమ్మ తండా వాసుల పద్ధతులు రుచించకపోవచ్చు. కానీ అదే ఆరోగ్యం.. ఆయుష్షు రహస్యం.