వైసీపీ నాలుగో జాబితా విడుదల

మూడు జాబితాల్లో 59 చోట్ల (అసెంబ్లీ, లోక్ సభ) మార్పులు చేర్పులు చేశారు జగన్. ఇందులో 50 అసెంబ్లీ స్థానాలు, 9 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి.

వైసీపీ నాలుగో జాబితా విడుదల

AP CM Jagan (Photo : Google)

Updated On : January 19, 2024 / 12:19 AM IST

YCP Fourth List : వైసీపీ నాలుగో జాబితా విడుదలైంది. 9 స్థానాల్లో మార్పులు చేర్పులతో ఫోర్త్ లిస్ట్ ను రిలీజ్ చేసింది వైసీపీ అధిష్టానం. ఇందులో ఒక ఎంపీ స్థానం ఉండగా.. 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.

నాలుగో లిస్టుకు సంబంధించి గత నాలుగు రోజులుగా సీఎం జగన్ చాలా సీరియస్ గా కసరత్తు చేశారు. అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటివరకు మూడు జాబితాలు విడుదల చేసింది వైసీపీ అధిష్టానం. మూడు జాబితాల్లో 59 చోట్ల (అసెంబ్లీ, లోక్ సభ) మార్పులు చేర్పులు చేశారు జగన్. ఇందులో 50 అసెంబ్లీ స్థానాలు, 9 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి.

వైసీపీ అభ్యర్థుల నాలుగో జాబితా..

చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా మంత్రి నారాయణ స్వామి

గంగాధర నెల్లూరు – రెడ్డప్ప
శింగనమల – వీరాంజనేయులు
మడకశిర – ఈర లక్కప్ప
నందికొట్కూర్ – డాక్టర్ సుధీర్ దారా
తిరువూరు – స్వామి దాస్
కొవ్వూరు – తలారి వెంకట్రావు
కనిగిరి – దద్దాల నారాయణ యాదవ్
గోపాలపురం – తానేటి వనిత

 

9 మందితో నాలుగో జాబితాలో రిలీజ్..
ఒక ఎంపీ, 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జిల ప్రకటన

ఇప్పటివరకూ మొత్తం 68చోట్ల మార్పులు..
58 అసెంబ్లీ స్థానాలు
10 లోక్ సభ స్థానాలు

మొత్తం 68 చోట్ల మార్పులు చేర్పులు జరిగాయి. అప్పుడే అయిపోలేదని మరికొన్ని చోట్ల కూడా మార్పులు ఉంటాయని వైసీపీ అధిష్టానం స్పష్టం చేసింది. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఒకటి రెండు చోట్ల మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. గిద్దలూరు, ఒంగోలుకు సంబంధించి కసరత్తు జరగనుంది. ఇక ఎంపీ స్థానాలకు సంబంధించి మొత్తం 12 స్థానాలకు మార్పులు చేర్పులు ప్రకటించాల్సి ఉంది. ఆ కసరత్తు పూర్తయ్యాక వాటి ప్రకటన ఉండే అవకాశం ఉంది.

* నందికొట్కూర్- ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆర్థర్ ఉన్నారు. ఆయన స్థానంలో కొత్త వ్యక్తి డాక్టర్ సుధీర్ దారాకు టికెట్ ఇచ్చారు జగన్.
* శింగనమల- ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా జొన్నలగడ్డ పద్మావతి ఉన్నారు. ఆమె స్థానంలో కొత్త వ్యక్తికి అవకాశం. జొన్నలగడ్డ పద్మావతి, ఆమె భర్త సీఎం జగన్ కు విధేయులుగా ఉన్నారు. అభ్యర్థిని మార్చేందుకు వారు అంగీకరించినట్లు సమాచారం. వాళ్ల ద్వారానే శింగనమలకు కొత్త అభ్యర్థిని ప్రకటించినట్లు సమాచారం.
* గంగాధరనెల్లూరు – ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా నారాయణ స్వామి ఉన్నారు. ఆయన మంత్రి కూడా. ఆయన చిత్తూరు ఎంపీగా బరిలోకి దిగనున్నారు. కాగా, తన కూతురు కృపాలక్ష్మికి గంగాధర నెల్లూరు టికెట్ ఇవ్వాలని పలుమార్లు జగన్ ను అడిగారు.
* తిరువూరు- ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణ నిధి. ఆయన స్థానంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన స్వామి దాస్ కు టికెట్ ఖరారు.
* మడకశిర – సిట్టింగ్ ఎమ్మెల్యేగా తిప్పేస్వామి ఉన్నారు. ఆయన స్థానంలో కొత్త ఇంఛార్జ్ ప్రకటన.
* కొవ్వూరు- సిట్టింగ్ ఎమ్మెల్యేగా తానేటి వనిత ఉన్నారు. హోంమంత్రిగా ఉన్నారు. అనూహ్యంగా తెరపైకి వచ్చిన కొవ్వూరు. గోపాలపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తలారి వెంకట్రావును కొవ్వూరుకు ఇంఛార్జిగా ప్రకటన.

* కనిగిరి- సిట్టింగ్ ఎమ్మెల్యేగా బుర్రా మధుసూదన్ యాదవ్ ఉన్నారు. ఆయన స్థానంలో దద్దాల నారాయణ యాదవ్ పేరు ప్రకటన.

 

YSRCP 4th List

YSRCP 4th List