సెలవుపై వెళ్ళిన ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేది 

  • Published By: chvmurthy ,Published On : May 10, 2019 / 02:23 PM IST
సెలవుపై వెళ్ళిన  ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేది 

Updated On : May 10, 2019 / 2:23 PM IST

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది అయిదు రోజుల పాటు శలవుపై వెళ్ళారు. ఈనెల 11 నుంచి 15 వరకు ఆయన శలవులో ఉంటారు. 16 వ తేదీ తిరిగి విధులకు హాజరవుతారు.  కేబినెట్ మీటింగ్ కు సంబంధించి  సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ  ఖారారు చేసిన అజెండానే ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి వచ్చిన తర్వాతే కేబినెట్ భేటీ జరిగే అవకాశం ఉంటుంది.  సోమవారం సాయంత్రం ఈసీ నుంచి క్యాబినెట్ భేటీపై స్పృష్టత వచ్చే అవకాశం ఉంది.