Chandrababu Pawan Kalyan Meeting : సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక భేటీ..

ముందుగా మంత్రిగా చేర్చుకున్న తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నిక చేస్తారా? లేకుంటే ఎమ్మెల్సీగా ఎన్నిక చేశాకే మంత్రివర్గంలోకి తీసుకుంటారా?

Chandrababu Pawan Kalyan Meeting : సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక భేటీ..

Updated On : December 16, 2024 / 4:32 PM IST

Chandrababu Pawan Kalyan Meeting : ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ కాబోతున్నారు. రాష్ట్రంలోని పలు అభివృద్ధి పనులు, రాజకీయ అంశాలతో పాటు నాగబాబు మంత్రిగా ప్రమాణస్వీకారం ముహూర్తంపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే నాగబాబుకు క్యాబినెట్ లో బెర్త్ కన్ ఫర్మ్ చేసిన సీఎం చంద్రబాబు.. మంత్రివర్గంలోకి ఎప్పుడు తీసుకోవాలి అనే దానిపై క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది.

ఈ సందర్భంగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి జనసేన జాబితాను సీఎంకు అందజేసే అవకాశం ఉంది. ఏపీ మంత్రివర్గంలోకి నటుడు నాగబాబు ఎప్పుడు వస్తారు అనే విషయం ఆసక్తి రేపుతోంది. ముందుగా మంత్రిగా చేర్చుకున్న తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నిక చేస్తారా? లేకుంటే ఎమ్మెల్సీగా ఎన్నిక చేశాకే మంత్రివర్గంలోకి తీసుకుంటారా? అనేదానిపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

జనసేనాని పవన్ కల్యాణ్ సూచనతో నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చేందుకు చంద్రబాబు నిర్ణయించారు. నాగబాబుకు ఏయే శాఖలు ఇవ్వాలి, ముందుగా ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇవ్వాలా? మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీని చేయాలా? అనే అంశంపై చంద్రబాబుతో డిస్కస్ చేయనున్నారు పవన్ కల్యాణ్. ఇప్పటికే నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చేందుకు చంద్రబాబు చేసిన ప్రపోజల్ కు పవన్ కల్యాణ్ అంగీకరించడం జరిగింది. మంత్రి పదవి చేపట్టాక 6 నెలల్లోనే చట్టసభకు ఎంపిక కావాల్సి ఉంటుంది. ముందుగా మంత్రి పదవి తీసుకున్నాక 6 నెలల్లోగా ఆయనను ఎమ్మెల్సీని చేయడమా? ఎమ్మెల్సీని చేశాక మంత్రి పదవి ఇవ్వడమా? అనేదానిపై చర్చ జరగనుంది. నాగబాబుకు ఏ శాఖలు ఇవ్వాలి అనేదానిపై ఇప్పటికే కొంత స్పష్టత వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇంకా పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పోస్టులపైనా చంద్రబాబు, పవన్ చర్చించనున్నారు. ఏయే పోస్టులను జనసేనకు కేటాయించాలి అనేదానిపై ఒక లెక్క తేలే అవకాశం ఉంది. జనసేన పార్టీకి సంబంధించి ఒక జాబితాను చంద్రబాబుకు పవన్ కల్యాణ్ సమర్పించనున్నారని సమాచారం. ఏ నామినేటెడ్ పోస్టు ఎవరికి ఇవ్వాలి అనే వివరాలపై చంద్రబాబుతో పవన్ కల్యాణ్ చర్చించనున్నారు.

 

Also Read : టీడీపీలోకి వైసీపీ కీలక నేత జోగి రమేశ్?