డిసెంబర్ 2 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు 

  • Published By: chvmurthy ,Published On : November 16, 2019 / 12:13 PM IST
డిసెంబర్ 2 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు 

Updated On : November 16, 2019 / 12:13 PM IST

డిసెంబర్ 2 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు  జరుగుతాయని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. 15 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. శాసనసభ,శాసన మండలి వ్యవస్థలను డిజిటలైజ్ చేస్తున్నామని.. ఇప్పటికే పేపర్ లెస్, డిజిటలైజ్ దిశగా చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. 

టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ సభ్యుడైనా పార్టీ మారాలనుకుంటే తప్పని సరిగా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాల్సిందే అన్నారు. రాజీనామా చేయకుండా పార్టీ మారితే వారిపై చర్యలు తప్పవన్నారు. 

సభా నాయకుడిగా సీఎం జగన్ కూడా ఇదే విషయం చెప్పారని స్పీకర్ తెలిపారు నేను దానికే కట్టుబడి వున్నానని…వంశీ వైసీపీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తీరాల్సిందేనని  తమ్మినేని తేల్చి చెప్పారు.