నీ నైజం మారే వరకు ఇదే పరిస్థితి : చంద్రబాబుపై మంత్రి బొత్స ఫైర్
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. చంద్రబాబు తన పద్ధతి మార్చుకోనంతకాలం ఇవే పరిస్థితులు ఎదురవుతాయని అన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. చంద్రబాబు తన పద్ధతి మార్చుకోనంతకాలం ఇవే పరిస్థితులు ఎదురవుతాయని అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. చంద్రబాబు తన పద్ధతి మార్చుకోనంతకాలం ఇవే పరిస్థితులు ఎదురవుతాయని అన్నారు. గురువారం (ఫిబ్రవరి 27, 2020) మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ నీ బుద్ధి, నీ నైజం, నీ ఆలోచన, నీ భాష మార్చుకోనంత కాలం ఇదే పరిస్థితి ఉంటుందని చంద్రబాబును హెచ్చరించారు. ఉత్తరాంధ్ర ప్రాంతమే కాదు రాయలసీమ, కోస్తా..ఏ ప్రాంతానికి వెళ్లినా ఇదే పరిస్థితి ఎదురవుతుందన్నారు.
బయట పరిస్థితులు బాగాలేవని పోలీసులు అంటే కాదంటావు..దేశంలో నీకంటూ ఒక చట్టాన్ని, రాజ్యాంగాన్ని రూపొందించారా…అందరికి ఉన్న రాజ్యాంగం, చట్టం నీకు వర్తించదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికారంలో ఉంటే మరోలా మాట్లాడుతావు..నీది నోరా..తాటి మట్టా అని మండిపడ్డారు. అమరావతిని నీవు కాదు.. రాష్ట్ర ప్రభుత్వమే రక్షిస్తుందని అన్నారు. అమరావతి ప్రాంతాన్ని ప్రభుత్వం లెజిస్లేటివ్ కేపిటల్ గా ప్రకటించిందన్నారు.
చంద్రబాబు రెండు రోజులుగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానులను వ్యతిరేకించిన చంద్రబాబుపై విశాఖ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. విశాఖ అభివృద్ధి చెందొద్దంటూ పర్యటనకు వెళ్తే ప్రజకు కోపం రాదా అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలను చంద్రబాబు చులకనగా మాట్లాడుతున్నారని..విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధాని ఎందుకని అంటున్నారని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమే విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని స్పష్టం చేశారు.
అల్లర్లు సృష్టించి శాంతిభద్రతల సమస్యలు సృష్టించడమే ధ్వేయమా అని ప్రశ్నించారు. విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. విశాఖ అభివృద్ధికి సీఎం జగన్ మౌలిక సదుపాయాలు కల్పిస్తుంటే ఆటంకం కల్పించాలని చూస్తున్నారని అన్నారు. తన సామాజిక వర్గం తప్ప వేరే వాళ్లు చంద్రబాబుకు అక్కరలేదన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలను చంద్రబాబు ఉన్మాదులన్నారని చెప్పారు. భూకబ్జాలపై మాట్లాడేందుకు చంద్రబాబు సిగ్గు పడాలన్నారు.