Karnataka Politics: కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్.. చేతులు కలిపిన బీజేపీ, జేడీఎస్.. సీట్ల పంపకాలు కూడా పూర్తి

రాష్ట్రంలో మొత్తం 28 లోక్‭సభ స్థానాలు ఉన్నాయి. అయితే జేడీఎస్ కు 4 స్థానాలు ఇచ్చేందుకు అమిత్ షా అంగీకరించినట్లు యడియూరప్ప తెలిపారు. ఇక బీజేపీ మిగిలిన స్థానాల్లో పోటీ చేయాలని చూస్తోంది

Karnataka Politics: కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్.. చేతులు కలిపిన బీజేపీ, జేడీఎస్.. సీట్ల పంపకాలు కూడా పూర్తి

Updated On : September 8, 2023 / 4:34 PM IST

JDS and BJP: నాలుగు నెలల క్రితం జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మంచి ఊపులో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలేలానే కనిపిస్తోంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ సెక్యూలర్ పార్టీలు చేతులు కలిపాయి. తాజాగా ఆ రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాలు కూడా పూర్తైనట్లు బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం యడియూరప్ప శుక్రవారం తెలిపారు. ఈ రెండు పార్టీల కలయికతో కాంగ్రెస్ పార్టీకి కష్టాలు మొదలైనట్లే తెలుస్తోంది.

Uttar Pradesh: స్వాతంత్ర్యం వచ్చి 76 ఏళ్లకు ఆ గ్రామంలో మొట్టమొదటిసారి నల్లా నీళ్లు వచ్చాయి

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ ఒంటరి పోరు కారణంగా కాంగ్రెస్ పార్టీ చాలా లాభపడింది. 42 శాతం ఓట్లతో 224 సీట్లకు గాను ఏకంగా 135 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. ఇక బీజేపీకి 36 శాతం ఓట్లు వచ్చినప్పటికీ 66 సీట్లే వచ్చాయి. అలాగే జేడీఎస్ 13 శాతం ఓట్లతో 19 సీట్లకే పరిమితం అయిపోయింది. బీజేపీ, జేడీఎస్ పార్టీల ఓట్లు కలిపితే కాంగ్రెస్ పార్టీకంటే ఎక్కువ ఉంటాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కనుక ఈ రెండు పార్టీల ఓట్లు మొత్తంగా కలిస్తే కాంగ్రెస్ భారీగా నష్టపోనున్నట్లు కనిపిస్తోంది.

CM Bhupesh Baghel : ఢిల్లీ నో ఫ్లై జోన్‌ .. నేను ఎలా వెళ్లగలను..? : జీ20 డిన్నర్‌‌కు హాజరుకావటంపై సీఎం బఘేల్ వ్యాఖ్యలు

రాష్ట్రంలో మొత్తం 28 లోక్‭సభ స్థానాలు ఉన్నాయి. అయితే జేడీఎస్ కు 4 స్థానాలు ఇచ్చేందుకు అమిత్ షా అంగీకరించినట్లు యడియూరప్ప తెలిపారు. ఇక బీజేపీ మిగిలిన స్థానాల్లో పోటీ చేయాలని చూస్తోంది. అయితే ఇంకే పార్టీయైనా పొత్తుకు వస్తే ఒకటి, రెండు సీట్లిచ్చే అవకాశం ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 25 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక సీటులో గెలిచింది. ఇక జేడీఎస్ కూడా ఒక సీటుతో సరిపెట్టుకుంది. స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానం గెలిచారు.