టీడీపీ, వైసీపీ ఒక్కటే : కార్యకర్తలకే సంక్షేమ పథకాలు

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ సంక్షేమ పధకాలు వైసీపీ కార్యకర్తలకే అందుతున్నాయని ఆరోపించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ . విజయవాడలో ఈ రోజు ఆయన మాట్లాడుతూ..గత టీడీపీ హయాంలోనూ ఇదే జరిగిందని… కేంద్ర పధకాలను తమ పధకాలుగా వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందన్నారు.
లబ్దిదారుల ఎంపిక వైసీపీ కార్యకర్తల కమిటీల ద్వారా చేయటం సరికాదని ఆయన హితవు పలికారు. గతంలో టీడీపీ చేసిన తప్పులనే వైసీపీ ప్రభుత్వం చేస్తోందన్నారు. బీజేపీ తో పొత్తు వీడామని చంద్రబాబు ఇప్పడు బాధపడుతున్నారని రాం మాధవ్ అన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తామని రాం మాధవ్ స్పష్టం చేశారు. ఏపీ లో నిర్ణయాత్మక ప్రతి పక్ష పాత్ర పోషిస్తామని ఆ దిశగా పార్టీని బలోపేతం చేసేలా కార్యక్రమాలు రూపోందిస్తున్నట్లు ఆయన వివరించారు.