Etela Rajender : బీజేపీలోకి రావాలంటూ ఈటలకు ఆహ్వానం

మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంలో మలుపులు తిరుగుతున్నాయి. అనుచరులతో ఈటల రాజేందర్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. బీజేపీ నేతల ప్రతిపాదనలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. పార్టీలోకి రావాలంటూ ఇప్పటికే బీజేపీ నేతల నుంచి ఈటలకు ఆహ్వానం అందినట్లుగా సమాచారం వస్తోంది.

Etela Rajender : బీజేపీలోకి రావాలంటూ ఈటలకు ఆహ్వానం

Etela Rajender

Updated On : May 26, 2021 / 2:13 PM IST

Etela Rajender : మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంలో మలుపులు తిరుగుతున్నాయి. అనుచరులతో ఈటల రాజేందర్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. బీజేపీ నేతల ప్రతిపాదనలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. పార్టీలోకి రావాలంటూ ఇప్పటికే బీజేపీ నేతల నుంచి ఈటలకు ఆహ్వానం అందినట్లుగా సమాచారం వస్తోంది. ఇప్పటికే రాష్ట్ర నేతలతో చర్చలు జరిపిన ఈటల కార్యకర్తల అభిప్రాయం కూడా తీసుకున్న తర్వాతనే నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

అలానే కాంగ్రెస్ నేతలతోనూ ఆయన సంప్రదింపులు జరుపుతున్న ఈటల.. ఎటూ తేల్చుకోలేక పోతున్నట్టుగా సమాచారం అందుతోంది. ఈటల రాజేందర్ అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ నేతలను వరుసగా కలుస్తున్నారు. బీజేపీ నేతల నుంచి ఆఫర్లు కూడా అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. కార్యకర్తల అభిప్రాయం మేరకే ఈటల డెసిషన్ తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.