మరో 15 ఏళ్లు బతుకుతా.. నా బాధంతా అదే : చంద్రబాబు
టీడీపీ చీఫ్ చంద్రబాబు తన ఆరోగ్యంపై స్పందించారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యం బాగుంటే మరో 15 ఏళ్లు లేదా 20 ఏళ్లు జీవిస్తానని చెప్పారు. అయినా తన గురించి తాను

టీడీపీ చీఫ్ చంద్రబాబు తన ఆరోగ్యంపై స్పందించారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యం బాగుంటే మరో 15 ఏళ్లు లేదా 20 ఏళ్లు జీవిస్తానని చెప్పారు. అయినా తన గురించి తాను
టీడీపీ చీఫ్ చంద్రబాబు తన ఆరోగ్యంపై స్పందించారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యం బాగుంటే మరో 15 ఏళ్లు లేదా 20 ఏళ్లు జీవిస్తానని చెప్పారు. అయినా తన గురించి తాను ఆలోచించుకోవడం లేదని, తన ఆందోళన అంతా రాష్ట్ర భవిష్యత్తు గురించేనని చెప్పుకొచ్చారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం(ఫిబ్రవరి 03,2020) చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. తన ఆరోగ్యం గురించి ఆలోచించడం లేదన్న ఆయన.. రాష్ట్ర భవిష్యత్తు తరాల గురించి తాను ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు. ‘‘9 నెలల్లోనే కనీవినీ ఎరుగని ఆర్థిక పతనం చోటు చేసుకొంది. మూర్ఖత్వం, మొండితనం, కక్ష సాధింపు తప్ప రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లే ఆలోచనలు కనిపించడం లేదు. రాష్ట్రం నుంచి బయటకు పారిపోయేవారే తప్ప రాష్ట్రానికి వచ్చేవారు లేరని” చంద్రబాబు వాపోయారు.
నా బాధంతా రాష్ట్ర భవిష్యత్తు గురించే:
ప్రజలే దేవుళ్లుగా, సమాజమే దేవాలయంగా భావించే తాను జీవితంలో ఏనాడూ పదవుల కోసం ఆశపడలేదన్నారు చంద్రబాబు. ఇకముందు కూడా ఆశపడబోనని తేల్చి చెప్పారు. మూడు రాజధానుల అంశంపై మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. తన ఆరోగ్య పరిస్థితి, నారావారిపల్లెలో వైసీపీ సభ నిర్వహణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి తన ఆరోగ్యం బాగుందన్న చంద్రబాబు.. ఏ ఇబ్బందులు రాకుంటే మరో 15 ఏళ్లు బతుకుతానేమోనని అన్నారు. ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, పార్టీ పరంగా ఎలాంటి సమస్యలు లేవన్న ఆయన.. తన బాధంతా రాష్ట్రం గురించే అన్నారు. జగన్ పరిపాలన చూస్తున్నప్పుడు ఏపీ భవిష్యత్తు ఏమైపోతుందోననే వేదన కలుగుతోందన్నారు.
సేవ్ అమరావతి:
రాజధాని రైతులు చేస్తున్న నిరసనలకు మిగతా ప్రాంతాల ప్రజలు కూడా మద్దతు పలకాలని, సేవ్ అమరావతిని ప్రజా ఉద్యమంగా మలుచుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్ సీఎం పదవి చేపట్టిన తర్వాత అన్నీ రివర్స్ నిర్ణయాలే తీసుకుంటున్నారని, ప్రజలంతా అప్రమత్తమై ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని సూచించారు.
మా ఊరి వాళ్లు వైజాగ్ వస్తారా?
నారావారిపల్లెలో వైసీపీ సభ నిర్వహణపై స్పందించిన చంద్రబాబు.. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘బుద్ధి ఉన్నవారు ఎవరైనా మా ఉరి నుంచి వైజాగ్ వెళ్లాలని అనుకుంటారా? మంత్రులకు కనీసం ఆలోచన లేదా? మా ఊరి వాళ్లు అమరాతిని దాటి వైజాగ్ వెళ్లాలని ఆలోచిస్తారా? వందశాతం అలా అనుకోరు. అలాంటప్పుడు మూడు రాజధానులకు మద్ధతుగా మా ఊరిలో వైసీపీ సభ నిర్వహిస్తే ప్రజలు ఎలా వస్తారు?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ పాలనలో రాష్ట్రం బీహార్ కంటే వరస్ట్‌గా తయారైందన్నారు.